– కొసాగుతున్న పెట్టుబడులు
– ఇప్పటికే 34 ప్రాజెక్టులకు ఒప్పందాలు
– సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి
అమరావతి: గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుచున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చి పలు ఒప్పందాలు చేసుకోవడం జరుగుచున్నది. ఇప్పటి వరకూ రూ.6,78,345 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. తద్వారా 4,28,705 మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
1. పరిశ్రమలు మరియు వాణిజ్యం
-2024-29 ఐదేళ్ల కాలానికి సంబందించి రూపొందించిన పలు విధానాలైన AP MSME & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ పాలసీ (MEDP), AP ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (FPP), ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ & AP టెక్స్‌టైల్, అపెరల్ & గార్మెంట్స్ (TAG) పాలసీల సవరణల కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు మరియు మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కు ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
-బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, విభిన్న ప్రతిభావంతులు మరియు మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు ప్రోత్సాహాలను పెంచండం జరిగింది.
-35% పెట్టుబడి రాయితీని 45% నికి పెంచడం జరిగింది.
-ఇప్పటి వరకూ మేన్యూఫ్యాక్చరింగ్ ఆక్టివిటీస్ కు ఈ పెట్టుబడి రాయితీ అందజేయడం జరుగుతుంటే, ఇకపై రవాణా, లాజిస్టిక్స్ ఆక్టివిటీస్ కు కూడా 45% రాయితీని గరిష్టంగా రూ. 75 లక్షల వరకూ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
– కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికే ఈ పెట్టుబడి రాయితీలు వర్తిస్థాయి.
-ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు భూమి విలువపై 50 శాతం రాయితీని గరిష్టంగా రూ.2.00 లక్షలు ఇవ్వడం జరిగేది.
-కానీ నేడు తీసుకున్న నిర్ణయం ప్రకారం 75 శాతం రాయితీని గరిష్టంగా రూ.25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.
-అదే విధంగా ఇంతకు ముందున్న MSMEDP-4.0 పాలసీలో మహిళలు, బి.సి. మరియు విభిన్న ప్రతిభావంతులకు ఆరు సంవత్సరాల పాటు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూ.1/- ఇవ్వడం జరిగేది. ఎస్పీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూ.1.50 లు ఐదు సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగేది.
-ఇప్పుడు అన్ని వర్గాలకు అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూ.1.50 లు ఐదు సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది.
-State GST రీయింబర్స్ మెంట్ ప్రోత్సాహాన్ని ఐదు సంవత్సరాల పాటు అన్ని వర్గాల వారికి ఇవ్వడం జరుగుతుంది.
2. పరిశ్రమలు మరియు వాణిజ్యం
-తే.30.01.2025 దీన జరిగిన స్టేట్ ఇన్వెస్టుస్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం సిఫార్సుల ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-కొన్ని రకాల ప్రోత్సాహాలను ప్రభుత్వం వారు అందజేయాలని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎలీప్, ఇఎంసి ( కొప్పర్తి) తదితర కంపెనీలు కోరిన అంశంపై రాష్ట్ర మంత్రి మండలి చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
-కోరమండల్ ఇంటర్నేషన్ లిమిటెడ్ వారు కోరిన విధంగా పది సమాన వాయిదాల్లో పెట్టుబడి రాయితీ 30 శాతాన్ని, రికార్బొనైజేషన్ ప్రోత్సాహాన్ని పది సమాన వాయిదాల్లో 25 శాతాన్ని, విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూ.2/- ల చొప్పున పదేళ్ల పాటు ఏడాదికి గరిష్టంగా 3.50 కోట్ల యూనిట్లకు రాయితీని మరియు పే రోల్ కాస్టుపై 20 శాతం రాయితీని ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది.
-కోరమండల్ ఇంటర్నేషన్ లిమిటెడ్ వారు రాష్ట్రంలో రూ.1539 కోట్ల పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
-అదే విధంగా ఎలీప్ వారికి ఇంతకు ముందు తూర్పు గోదావరి జిల్లాలోని బాలభద్రాపురం లో 34.19 ఎకరాలు భూమిని కేటాయించండ జరిగింది.
ఇప్పడు వారి కోరిక మేరకు ఆ భూమికి బదులుగా అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలో 31.77 ఎకరాలు కేటాయించడం జరిగింది. తద్వారా రూ.305 కోట్ల పెట్టుబడులు మరియు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
3.రెవిన్యూ (ల్యాడ్స్)
-AP హక్కుల భూమి మరియు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం, 1971 (చట్టం నెం.26/1971) లోని సెక్షన్ 5 (1), (2) & (4) సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
– రెవిన్యూ వివాదాల పరిష్కారానికి ఇప్పటి వరకూ ఫస్టు అప్పిలేట్ అథారిటీ ఎం.ఆర్.ఓ. ఉండే వారు, ఆయన తిరస్కరిస్తే తదుపరి జిల్లా రెవిన్యూ అధికారి చూసేవారు.
-రెవిన్యూ వివాదాల పరిష్కానికై జిల్లా నలు మూలల నుండి డి.ఆర్.ఓ. కోసం జిల్లా కేంద్రానికి రావడం ఎంతో కష్టం కాబట్టి, ఆ అధికారాన్ని ఆర్.డి.ఓ.కు మార్చుతూ నేడు మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
4.జలవనరుల శాఖ
-2014-2019 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో నీరు చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు పనుల తనిఖీ మరియు నీరు చెట్టు పనులను అమలు చేసిన 386 మంది ఇంజనీర్లపై చేపట్టిన క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకొనేందుకు చేసిన ప్రతి పాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఈ విషయంలో గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంలో ఆ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లపై విజిలెన్సు కేసులు, వారికి బిల్లులు చెల్లించ కుండా హింసపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టుర్లు కూడా మరణించడం జరిగింది.
-పలు కారణాలుగా ఆగిపోయిన చెల్లింపులు మొత్తం రూ.50.56 కోట్ల చెల్లింపులకు నేడు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
5.జలవనరుల శాఖ
-APCRDA / ADCL (EAP- Externally Aided Projects- సపోర్టు పనుల మినహా) యొక్క అన్ని పనులకు GO Ms No.94, I & CAD (PW-COD) డిపార్ట్‌మెంట్, Dt:01.07.2003 యొక్క అనుబంధం-1 లోని పారా 11 (a) క్లాజ్ లో నిర్థేసించబడిన బిడ్ సామర్థ్యం పెంపు కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-కేవలం CRDA పరిధిలో దాదాపు రూ.30 నుండి 40 వేల కోట్ల విలువైన పనులు, జల్ జీవన్ మిషన్ పనులు రూ.50 నుండి 60 వేల కోట్ల విలువైన పనులు మరియు అమృత్, జలవనరుల శాఖ పనులు అన్నీ కలుపుకుని దాపు దాపు లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులను ఈ ప్రభుత్వం ప్రారంభించింది.
-ఇన్ని పనులను నిర్వహించేందుకు ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్లు దొరడకం కష్టమనే నేపథ్యంలో బిడ్ సామర్థ్యాంలో మార్పులు చేయడం జరిగింది. సవరించిన ఈ నియమం అన్ని శాఖలకు వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
6.జలవనరుల శాఖ
-పోలవరం ప్రాజెక్టులోని ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో హౌసింగ్ బ్యాలెన్స్ పనుల కోసం తాజాగా టెండర్లు పిలవడానికి చేసిన ప్రతిపాదనతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసేందుకు మరియు ధరల సర్దుబాటుకు సంబంధించి జి.ఓ. ఎంఎస్. నెం. 62, డబ్ల్యూఆర్ (సంస్కరణలు) డిపార్టుమెంట్, తేది:30.11.2021 లో జారీ చేసిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకునేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-2027 కల్లా ఈ ప్రాజక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో నిర్వాశితులకు సత్వరమే న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిర్మించే దాదాపు 50 హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు సోషల్ ఇన్ప్రాస్రక్చర్ ను కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
6.రెవిన్యూ (దేవాదాయ)
-TTDలో నూతన పోస్టుల సృష్టికి బదులుగా ప్రస్తుతం ఉన్న 15 పోటు వర్కర్స్ (సీనియర్) పోస్టులను పోటు సూపర్‌వైజర్ల స్థాయికి అంటే సీనియర్ అసిస్టెంట్ కేడర్‌కు సమానంగా రూ. 40970-124380 (RPS-2022) పెంచేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-తిరుపతిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అందుకు తగ్గట్టుగా స్వామి వారి ప్రసాదం అయిన లడ్డూలను తయారు చేయడంలో ఎటు వంటి లోపాలకు తావు లేకుండా ఉండేందుకై మరియు తగు నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకై పోటు వర్కర్స్ (సీనియర్) పోస్టులను పోటు సూపర్‌వైజర్ల స్థాయికి పెంచడం జరిగింది.
8.రెవిన్యూ (రిజిస్ట్రేషన్స్-1)
-రిజిస్ట్రేషన్ & స్టాంపుల విభాగంలో పత్రాల నమోదు కోసం డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ముందస్తు నియామకం ద్వారా నమోదు) ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు మరియు రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలు ఎటు వంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకై విధానం ఎంతో దోహదపడుతుంది.
9.రెవిన్యూ (ల్యాడ్స్)
-చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిదిలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో & కోట మండలం కొత్తపట్నం గ్రామంలో అనధికారికంగా ఆక్యుపేషన్ లో ఉన్న రైతులకు కొన్ని షరతులకు లోబడి జి.ఓ.ఎంఎస్. నెం.571, Rev. (Assign.1) Dept., Dt:14.09.2012 ను సడలిస్తూ ఏక కాల ప్రత్యేక పరిహారం క్రింద ఎకరానికి రూ.8 లక్షలు చొప్పున మొత్తం రూ.78,84,83,200/- లను ఎక్స్‌గ్రేషియా మంజూరుకు చేసిన ప్రతి పాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
10.ప్రణాళికా శాఖ
-ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ 2025″ ముసాయిదా ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నున్న మర్రిచెన్నారెడ్డి హెచ్.ఆర్.డి. సెంటర్ తరహాలో కేంద్ర ప్రభుత్వ పాలసీలకు తగ్గట్టుగా మన రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా అటు వంటి సెంటర్ ను అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-అనంతపూర్ లో నిర్మించిన కస్టమ్స్ శిక్షణా కేంద్రంలో కల్పించిన అన్ని వసతులను మంత్రులతో కూడిన కమిటీ పరిశీలించి అమరావతిలో నిర్మించే సెంటర్ లో కూడా ఆయా వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-ఈ విధానం ద్వారా “స్వర్ణ ఆంధ్ర @ 2047” లక్ష్యాలకు అనుగుణంగా నైపుణ్యం, స్థితిస్థాపకత మరియు కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఏర్పడు తుంది.
-సమగ్ర వృద్ధికి అత్యాధునిక సాంకేతికతల కోసం భవిష్యత్ సన్నద్ధకై నైపుణ్యాలతో ప్రభుత్వ ఉద్యోగులకు సాధికారత కల్పించడం
-రాష్ట్ర సామర్థ్యాలు మరియు డెలివరీ మెకానిజమ్‌లను మెరుగుపరచడం, పటిష్టమైన పాలనా పద్ధతులను పొందుపరచడం ద్వారా రాష్ట్ర సంస్థలను బలోపేతం చేయడం
-నిర్థేశిత రంగం యొక్క సామర్థ్యం, అభివృద్ధిని వేగవంతం చేయడం – అధిక ప్రాధామ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం
11. రాష్ట్రం మరియు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని క్రమంగా తగ్గించాలనే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇంధన శాఖ చేసిన పలు ప్రతిపాదలను నేడు మంత్రి మండలి ఆమోదించింది. దాదాపు 3,200 మెగా వాట్ల సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించాలని పలు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తద్వారా దాదాపు రూ.5,500 కోట్ల పెట్టుబడులు, 3,500 మంది ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. ఇంతకు ముందు కేటాయించని ప్రాంతాల్లో ఈ సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించండ జరుగుతుంది.
-M/s ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనపై ఇతర డెవలపర్‌లకు సామర్థ్యాల బదిలీకి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కు అనంతపురం జిల్లా గంగవరం గ్రామంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ కేటాయింపునకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-M/s SAEL SOLAR MHP1 ప్రైవేట్ లిమిటెడ్ కు అనంతపురం జిల్లా బోడయపల్లి గ్రామం మరియు వైఎస్ఆర్ జిల్లా కోడూరు గ్రామంలో 300 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ కేటాయింపుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 ప్రకారం i) M/s అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ii) M/s కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ & iii) M/s ఆస్పారీ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు కోసం M/s ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-వైఎస్ఆర్ జిల్లాలోని గోవిందపల్లి దిగువ తదితర గ్రామాల్లో మరియు నంద్యాల జిల్లాలోని మాయలూరు గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజు ప్రాతిపదికన M/s SAEL SOLAR MHP2 ప్రైవేట్ లిమిటెడ్ (300 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ ప్లాంట్) కు కేటాయింపుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-M/s.మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వారు అన్నమయ్య జిల్లా చింతలకుంట సమీపంలోని 2000 మెగావాట్ల కొమ్మూరు PSP ప్రాజెక్ట్ నెలకొల్పేందుకు చేసిన అభ్యర్థనపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలి గ్రామంలో 1500 మెగావాట్ల & చిట్టంవలస గ్రామంలో 800 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కేటాయింపు కోసం నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేసిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.