నిజస్వరూపం బయటపెట్టుకున్న కాంగ్రెస్

– రేవంత్ హామీ ప్రకారం నిన్న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. మరి నిన్ననే ఒకటో తేది. ఇది ఫిబ్రవరి నెలే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదు’ అని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

‘హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసింది. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Leave a Reply