కుమారి ఆంటీ మీదనా?.. బాణమక్క వాగ్ధాటి మీదనా?

ఇప్పుడు మీడియా డిబేట్స్, ప్రజల చర్చలు, పేపర్ మెయిన్ హెడింగ్స్.. ఎవరిమీద…

కుమారి ఆంటీ మీదనా?
బాణమక్క వాగ్ధాటి మీదనా?
రక్తి కట్టించే కుటుంబ నాటకం మీదనా?
తుస్సు మనిపించే 30 కంటైనర్లు ఎపిసోడ్ మీదనా?

రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లక్షల కోట్ల అప్పులు తీర్చ గలిగె, సంపద ను సృష్టించే ప్రణాళికల మీద కానీ, ఏమి విధివిధానాలను ఉపన్యసించకుండా, మా అన్న నాకు ఈ అన్యాయం చేశాడు… ఆ ఘోరాలు చేశాడు… అనే షమ్మి గారి ఉపన్యసాల మీదనా?

53 ఎకరాలు ఇవ్వలేదు… ఇచ్చి ఉంటే ప్రపంచంలో తల దన్నెలా రైల్వే జోన్ చేసేసి ఉండే వాళ్ళం అనే మంచి ఆహ్లాదకరమైన స్టేట్మెంట్స్ మీదనా?
గోవా లాగా తయారయిన గుడివాడ గోల్మాల్ మీదనా?
రాజ్యసభ సీటిచ్చి, అయోధ్య కు కూడా పరివార సమేతంగా పిలిపించుకుని, రేపు రాబోయే ఎలక్షన్స్ లో మెగా + జూనియర్ లని వాడేసుకుందామనే మంచి ఆలోచనల మీదనా.?
బాణమక్క + ఆత్మ ల నాటకంలో, కాంగ్రెస్ ఏ విధంగా లొంగిపోయిందో అనే దాని మీదనా?
అసలు ఈ షమ్మి vs కాంగ్రెస్ గేమ్ లో, ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు అనే విచిత్ర మైన రిజల్ట్ మీదనా?
ఏమిటో… ఆంధ్రా అంత అయోమయం లాంటి అద్భుతాలు అంట.

జయహో… ఆంధ్రులారా..

విద్య
ఆరోగ్యం
పరిశ్రమలు
అందమైన భవనాలు
రహదారులు,
పోర్ట్ ల అభివృద్ధి
IT ఉద్యోగాలు
ప్రశాంత జీవన స్రవంతి,
ఇండస్ట్రియల్ కారిడార్స్
పోలవరం లాంటి ప్రాజెక్టులు
ప్రత్యేక హోదా
అన్నింటికీ మించి, ఒక అందమైన అద్భుత రాజధాని….

ఇటువంటివి అన్ని, మనకెందుకు ఆంధ్ర ప్రజలారా..

– తీగల రవీంద్ర

Leave a Reply