Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో కాంగ్రెస్ బలపడుతోంది…

– పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి

నరసరావు పేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది.. విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె ఇక్కడి విలేఖర్లతో గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా చాలా అవసరం. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే విభజన హామీలు సాధ్యమని ఆమె అన్నారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే.. బీజేపీ గడిచిన 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. కానీ బీజేపీ రాజధానికి అప్పులు ఇస్తుంది.

పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది. బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ,జనసేన పార్టీలు తాకట్టు పెట్టాయి. రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ కి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. బీజేపీని వ్యతిరేకించేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుంది. బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నది కాంగ్రెస్ కి మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అన్ని వ్యూహాలు రచిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం.

LEAVE A RESPONSE