Suryaa.co.in

Andhra Pradesh

మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యం

– ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.

పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు….రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీ రాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింది ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్‌కు కారణం అయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని.. ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE