Suryaa.co.in

Andhra Pradesh

డిసెంబర్ లో అమరావతి అమర వీరుల స్తూప నిర్మాణం

– త్వరలో సిఎంను కలుస్తాం
– స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య వెల్లడి

గుంటూరు: ఈ ఏడాది డిసెంబర్ లో ప్రజా రాజధాని అమరావతి అమర వీరుల స్మారక స్థూప నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అమరావతి అమరవీరుల స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చికాగో లోని ఎన్ఆర్ఐ యలమంచిలి ప్రసాద్, పలువురు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మృతుల వివరాలు, స్థల పరిశీలన కొంత మేరకు పూర్తి చేసినట్లు చెప్పారు.

త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు అన్ని వివరాలతో స్థూప నిర్మాణ అవశ్యకతపై నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 1631 రోజులు జరిగిన చారిత్రాత్మక రాజధాని ఉద్యమంలో 272 మంది రైతులు, ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నాటి ప్రభుత్వ వేధింపులకు మృతి చెందారని, వీరిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఉద్యమానికి సహాయ, సహకారాలు అందించిన వారు కూడా ఉన్నారన్నారు.

ఇప్పుటికే భూములు ఇచ్చిన గ్రామాల్లో చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. స్తూప నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇదో చారిత్రాత్మక ఘటంగా ఉంటుందని, ఒక రాజధాని కొరకు భూములను త్యాగం చేసిన రైతులు, అదే రాజధాని కోసం కూడా రక్కసి నాయకుడిపై చేసిన శాంతియుత యుద్దానికి సాక్ష్యం అవుతోందని అభిప్రాయపడ్డారు. త్వరలో ఇద్దరు ఎన్ ఆర్ ఐ లు కూడా స్తూప నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించేందుకు వస్తున్నట్లు బాలకోటయ్య వివరించారు.

LEAVE A RESPONSE