– ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదు
– న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్ప?
– మాజీ ఎంపీ మోదుగుల వివాదాస్పద వ్యాఖ్యలు
గుంటూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు న్యాయదేవత నిద్రపోతోందా?న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించేలా వ్యవహరించాలి. మీకు పనికివచ్చే అంశాలే టబుల్‌మీదకు తీసుకుంటారా? అంటూ న్యాయవ్యవస్థ పనితీరును ఆక్షేపించారు.
ఇంకా వేణుగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే..
ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదు. తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది.న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్ప?దీనిపై పూర్తి స్దాయి లో చర్చ జరగాలి. న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా? న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలగేలా చేయాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తారా? రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసింది. అందులో బిజేపి పాత్ర కూడా ఉంది. రాష్ట్ర విభజన పై వేసిన పిటిషన్ లపై ఎందుకు వాదనలు జరగడం లేదు? అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటి? మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టు లో పిటిషన్ వేశాం. 2019 లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్ లపై తీర్పు లు ఇవ్వాలి.