-నాతో కాంట్రాక్టులో ఉన్న వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి
– వినోద్ కుమార్
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. జ్వరం, జలుబు ఉండటంతో వినోద్ కుమార్ కు వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని హోమ్ ఖ్వారంటీన్ లో ఉన్నాను. నాతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని వినోద్ కుమార్ కోరారు.