అధికార పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా దర్యాప్తు చేస్తున్న సీపీ కాంతి రాణా టాటా

-బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, ఎస్ఈసీ, డిజిపికు వర్ల రామయ్య లేఖలు
-ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు ఏమి సంబంధం లేదు
-బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్న జగన్ ముఠా
-వైసీపీ అభ్యర్ధికి మేలు చేకూరేందుకు బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

బోండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసు పెట్టకుండా విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్‌కు, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖలు రాశారు. బోండా ఉమాకు సీఎం రాయి దాడికి సంబందం లేకపోయినా, తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని లేఖలో వర్ల పేర్కొన్నారు.

వర్ల రామయ్య లేఖలో పేర్కొన్న విషయాలు…
“సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బోండా ఉమాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ కావాలనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే బోండా ఉమాను అరెస్టు చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి రోడ్‌షోకు హాజరుకావాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను మీడియా స్వయంగా నివేదించింది.

కానీ కొంతమంది కళంకిత పోలీసులు దాడి చేయని వ్యక్తులను ఇరికించేందుకు కుట్రపన్నారు. అసలు ఏ సంబంధం లేని బోండా ఉమాను ఇరికించేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా, అధికార YSRCPతో బహిరంగంగా కక్ష సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో సీపీ కాంతి రాణా వైఫల్యం చేందారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే అధికార పార్టీ అభ్యర్ధి ఒత్తిడితో బోండా ఉమాను అరెస్ట్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. మీడియాను మరియు ప్రతిపక్ష పార్టీలను బహిరంగంగా నిందిస్తూ, సీఈవోకు రిప్రజెంటేషన్‌లు సమర్పించడం ద్వారా అఖిల భారత అధికారుల నియమనిబంధనలను సీపీ కాంతి రాణా ధిక్కరించారు.

ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనర్‌గా కాంతి రాణాను తప్పించాలని పలుమార్లు మేము కోరాం. ఇప్పుడు సహజ న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ఎన్నికల నోటిఫికేషన్ తేదీకి ముందు తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గపు అరెస్టులను ఆశ్రయించకుండా ఉండే విధంగా పోలీసులను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు, ఏపీ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం” అని వర్ల రామయ్య తెలియజేశారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డికి వాట్సాప్ ద్వారా వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Leave a Reply