Suryaa.co.in

Andhra Pradesh

అంగన్ వాడీల అభివృద్ధి ఘనత చంద్రబాబుదే

-జగ్గయ్యపేట పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీల 4 వ రోజు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

రాజకీయ కక్షతో అంగన్వాడీ కార్యకర్తను పట్టపగలు వైసీపీ నేత ట్రాక్టర్ తో తొక్కించి చంపడం, మరో వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం వంటి ఘటనలు జగన్ రెడ్డి నిరంకుశ పాలనను ప్రత్యక్ష సాక్ష్యాలు.

నాలుగేళ్లుగా అంగన్వాడీల సమస్యలను జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ కంటే ఎక్కువ జీతమిస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో గొంతెమ్మ అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక వారిని పోలీసు లారీలతో చితకబాదించిన ఘటనలను ఎవరూ మరిచపోలేరు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు జీతాలు పెంచమని అంగన్వాడీలు కోరడం జగన్ రెడ్డికి తప్పుగా కనిపిస్తోందా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనోవికాస కేంద్రాలుగా పనిచేసిన అంగన్ వాడీ కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.నాడు – నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఆచరణలో ఘోరంగా విఫలమైంది వాస్తవం కాదా?

అంగన్వాడీలనే కాదు కేంద్రాల్లోని పిల్లలనూ జగన్ రెడ్డి ఇబ్బందులపాలు చేస్తున్నాడు.గుజరాత్ సంస్థ అమూలపై ఉన్న మమకారం మన అంగన్వాడీ పిల్లలపై లేదు. ప్రతి ఏటా పాల కొరత సమస్య ఉంటున్నా పిల్లలను పట్టించుకోవడంలేదు. రైతులందరూ అమూల్ కే పాలు పోయాలని చెబుతున్న జగన్… మన పిల్లలను ఆకలితో మాడ్చేస్తున్నాడు.

అంగన్వాడీలకు అందని సంక్షేమం:
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు సంక్షేమానికి పూర్తిగా
దూరమయ్యారు. ఆదాయ పరిమితి నిబంధనతో పథకాల్లో కోత పెట్టారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆదాయ పరిమితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించి సంక్షేమం అమలు చేయగా జగన్ రెడ్డి రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న వారికే సంక్షేమ పథకాలు అమలు నిబంధనతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాడు.

నవరత్నాల అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించరాదు. ప్రస్తుతం అంగన్వాడీలకు రూ. 11,500 జీతం అందుతోంది.

ఈ నిబంధన వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 51,299 మంది అంగన్వాడీలు పథకాల ఆర్థిక సాయం కోల్పోతున్నారు. అలాగే పించను, అమ్మఒడి సాయం, ఇళ్ల పట్టాలు, నిర్మాణ రాయితీలు అందడంలేదు.

అంగన్ వాడీల అభివృద్ధి ఘనత చంద్రబాబు దే:
 అంగన్ వాడీలకు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 2018 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 4,200 ఉండగా దాన్ని రెండు విడతల్లో రూ. 6,300 వరకూ పెంచి 2018 జూలై లో రూ.10, 500 చేశారు. జగన్ రెడ్డి కేవలం వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నాడు.

తెలుగుదేశం ప్రభుత్వం జీతాల పెంపుతో పాటు గడిచిన ఐదేళ్లలో 18,301 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించడం జరిగింది. 55,607 అంగవాడీల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి. చేకూర్చాం.

వైసీపీ ప్రభుత్వం మాత్రం నాడు నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టి అంగన్ వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని ఊదరగొట్టడంతోనే సరిపెడుతోంది. మూడేళ్లుగా 17,984 నూతన అంగన్ వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

అంగన్వాడీల సమస్యలు పట్టని జగన్ మోహన్ రెడ్డి:
> మినీ అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తున్నప్పటికీ ఆయాకు ఇచ్చే జీతమే ఇస్తున్నారు.
> ఉద్యోగ భద్రత కల్పించా లని, కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటివి అమలుచేయాలని నాలుగేళ్లుగా అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.
> పాల బకాయిలు కోట్లలో ఉన్నాయి టీఏ బిల్లులు ఇవ్వడంలేదు. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు రావాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు.
> కేంద్రాల పర్యవేక్షణ పేరుతో వివిధ కమిటీలు, రాజకీయ నాయకులు అంగన్వాడీ సిబ్బందిని వేధిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారు.
> గిరిజన ప్రాంతాల్లో మినీ వర్కర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారు. 300 జనాభా దాటిన చోట ఉన్న మినీ సెంటర్ను మెయిన్ సెంటర్ గా మార్చాలని, మినీ అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రేడ్-2 సూపర్ వైజర్ పోస్టుల్లో అవకాశం
కల్పించాలన్న అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

అంగన్వాడీల డిమాండ్లు తీర్చాలి:
1. కనీస వేతనం రూ.26 వేలు చేయాలి. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
2. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి.
3. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి.
4. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలి.
5. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
6. అంగన్వాడీ విద్యను బలోపేతం చెయ్యాలి. పిల్లలకి యూనిఫామ్, అమ్మఒడి అమలు చెయ్యాలి.
7. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. పెండింగ్ లో ఉన్న టిఎ బిల్లుల వెంటనే ఇవ్వాలి.
8. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలుచెయ్యాలి.
9. హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి.
10. గ్రేడ్ 2 సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి. 2022 లో పరీక్షరాసి పెండింగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులలో మిగిలిన 164 పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE