ఒకే రోజు..రెండు దిగ్గజాలు ఔట్

ఒకరేమో బంతి పట్టిన మాంత్రికుడు..
ఇంకొకరు వికెట్ల వెనకుండి
మెరుపులా పడగొట్టే
ఘటికుడు..
షేన్ వార్న్..
రాడ్ మార్ష్..
ఇద్దరు దిగ్గజాలు..
అదే దేశం..
ఒకే రోజు..
జీవితం నుంచి రిటైర్ హర్ట్..
గాయపడిన లక్షలాది అభిమానుల హార్ట్..!

డెన్నిస్ లిల్లీ..రాడ్ మార్ష్..
లిల్లీ బంతి..
మార్ష్ గ్లవ్స్..
ఎన్ని వికెట్లో..
గ్రౌండ్ వాకిట్లో..!

సేఫ్ హాండ్స్..
ఇందుకు నిర్వచనం మార్ష్..
ఎందరో కీపర్లకు ఆదర్శం..
అయితే క్యాచ్..
లేదంటే స్టంప్..
బంతిని వదిలేదేలే!

వార్న్ బంతి చేపడితే
వార్నింగ్ బెల్స్..
బ్యాట్స్మన్ గుండె గుభేల్..
తిప్పేస్తే బంతిని గిరాగిరా
ప్రత్యర్థులకు గాభరా..
బంతి గుట్టు
కనిపెట్టేలోగానే
వికెట్టు ఫట్టు…
అదో కనికట్టు..
గ్రౌండు అదిరేట్టు..
అలా అయ్యాడు
ఈ నిత్య యాత్రికుడు
ప్రపంచం మెచ్చిన
స్పిన్ మాంత్రికుడు..!

ఈ ఇద్దరూ
ఆస్ట్రేలియా క్రికెట్లో
టాప్ గేరులు…
వీరి మరణంతో
శోకసంద్రంలో కంగారూలు!

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply