రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్

-అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ
-రాజ్యసభలో మెజారిటీకి నాలుగడుగుల దూరమే
-కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్‌లో గెలిచిన బీజేపీ
-హిమాచల్‌లో ఓడిన మను సింఘ్వీ
-కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
(రఘువంశీ)

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్-బీజేపీల కొంపముంచాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ప్రభావం, అక్కడి కాంగ్రెస్ సర్కారు కూల్చేదిశకు దారితీస్తోంది. రాజ్యసభలో పూర్తి మెజారిటీకి, బీజేపీ మరో 4 స్థానాల దూరంలోనే ఉంది. అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారుగా ఉన్నందున, భవిష్యత్తులో బిల్లుల ఆమోదానికి వచ్చిన భయమేమీలేనట్లే.

రాజ్యసభ ఎన్నికల హడావిడి ముగిసింది. ప్రతీసారీ రాజ్యసభ ఎన్నికల లాగే ఈ సారి కూడా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 గురు బిజెపి కి ఓటు వేయడంతో కాంగ్రెస్ కి బీజేపీ కి సరి సమానంగా 34 ఓట్లు రావడంతో టాస్ వేస్తే బిజెపి అభ్యర్థి గెలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ కి హిమాచల్ లో ఈ రాజ్యసభ ఓటమి అసలు అసెంబ్లీ లో కూడా అధికారం కోల్పోయేలా చేస్తుంది ఏమో రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు ఇరువురు బలాలు సమానంగా ఉన్నాయి.

అలాగే యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగగా బిజెపి , ఎస్పీ పార్టీలకు తమకు ఉన్న ఎమ్మెల్యేలు బలం బట్టి బిజెపి కి 7 మరియు ఎస్పీ కి 2 రావాలి. మిగిలిన ఎక్స్ట్రా సీట్ రెండో ప్రాధాన్యత ఓటు తో, మరియు ఒక బీఎస్పీ, 6 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు ఓట్లతో బిజెపి గెలుచుకుని మొత్తం 8 గెలుచుకుంది. ఆశ్చర్యంగా కర్ణాటక లో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి వోట్ వేశారు.

మొత్తంగా 56 సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ 30 గెలుచుకుని, రాజ్యసభ లో 97 సీట్ల తో పెద్ద పార్టీ గా నిలిచింది. నామినేటెడ్ సభ్యులతో కలిసి NDA బలం 117 కి చేరింది. ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం 240, అంటే 121 సాధారణ మెజార్టీ కి NDA కి కేవలం 4 తక్కువ.

అదే 2/3వంతుల మెజార్టీ కి 39 తక్కువ. కానీ YSRC 11, బీజేడీ 9, BSP 1 BRS 5, ADMK 3 పార్టీలు NDA కు మద్దతు ఇస్తే మిగతా పార్టీలు నుండి కేవలం 10 ఓట్లు పడితే రాజ్యసభ లో కూడా 2/3వంతుల ఓటింగ్ లో NDA గెలుపు పొందుతుంది.

ఈ సారి బిజెపి ఒంటరిగానే 370 గెలవాలి, NDA 400దాటాలి అని మోదీ పిలుపునిచ్చారు. ఈ 370 సంఖ్య ఉద్దేశ్యం బహుశా లోక్ సభలో 2/3వంతుల 362 సీట్ల మార్క్ దాటడం అయి ఉంటుంది. అలాకాక గత సారి లాగా బీజేపీ 2024 ఎన్నికల్లో కనీసం 300+గెలుచుకున్నా కూడా NDA కి మిగతా మిత్ర పక్షాలతో కలిపి లోక్ సభలో 362 ఓట్లు రావడం పెద్ద కష్టం కాదు.

అంటే 2024 ఎన్నికల తరువాత బిజెపి/NDA కి రెండు సభల్లో 2/3వంతుల మెజార్టీ సాధించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాక పోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుంది.

Leave a Reply