దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల సమీక్ష సమావేశం

-ఊరెళ్తున్నారా.. జరభద్రం అంటున్న పోలీసులు*
రానున్న దసరా పండుగను నేపథ్యంలో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ శ్రీమతి రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., ఏడీసీపీ రామచంద్రుడు, ఏసీపీ శ్యామ్ బాబు, సైబరాబాద్ లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, క్రైమ్ సిబ్బంది, సీసీఎస్ పోలీసులతో సైబరాబాద్ సీపీ ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగకు ఊరికి వెళ్తున్న వారు అప్రమత్తంగా తెలిపారు. పండుగ సెలవులతో చాలా మంది ప్రయాణాలు చేస్తారని, ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని అన్నారు. దసరా పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల సిబ్బంది సరిహద్దు పోలీస్ కమీషనరేట్ సిబ్బంది తో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు.
అనంతరం డీసీపీ క్రైమ్స్ శ్రీమతి రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్., మాట్లాడుతూ.. పాత నేరస్తులు, హెచ్ బీ అఫెండర్స్ పై దృష్టి సారించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలన్నారు. రాత్రి వేళల్లో అనుమానిత వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టాలన్నారు. తనిఖీల సందర్భంగా బ్యారీకేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు రిఫ్లెక్టివ్ జాకెట్స్, బ్యాటన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
దసరా పండుగ సెలవులలో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసుల సూచనలు:

  •  ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
  • సెలవులలో బయటకు వెలుతున్నప్పుడు సెక్యూరిటి అలారం మరియు మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచింది.
  • మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళము అమర్చుకునడం మంచిది.
  • తాళము వేసి ఊరికి వెళ్లవల్సి వస్తే మీ యొక్క స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి.
  • మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.
  • మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మరియు మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.
  • నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి.
  • మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
  • మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Papers & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి, వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి.
  • మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది.
  • బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.
  • మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.
  • మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు మరియు ఇంటిలోపల CC Camera లు అమర్చు కొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో ఉంచండి.
  • అల్మరా మరియు కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు మరియు దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో మరియు కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశం లో ఉంచడం చిది.
  • బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు మరియు గుడికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి.
  • సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
  • సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
  • కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444 కు సమాచారం ఇవ్వాలి.

Leave a Reply