– తాగునీరు, ఆహారం కలుషితం వల్లే హెపటైటిస్ వ్యాప్తి
– ఒకే స్కూళ్లో 170 మంది హెపటైటిస్ బారిన పడ్డం దారుణం
– హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
– ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట
– కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ వైరస్ సోకి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించిన వైయస్సార్సీపీ నేతల బృందం
– పరామర్శ లో పాల్గొన్న అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైయస్సార్సీపీ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పలువురు వైయస్సార్సీపీ నేతలు
విశాఖపట్నం: కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలు కలుషిత నీరు, ఆహారం వల్లే హెపటైటిస్ బారిన పడ్డారని.. ప్రభుత్వ పాఠశాలల్లో రక్షిత నీటితో పాటు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖ కేజీహెచ్ లో హెపటైటిస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలికలను అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, మాజీ మంత్రులు పుష్పశ్రీవాణి, సీదిరి అప్పలరాజుతో పాటు పలువురు వైయస్సార్సీపీ నేతలు పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు విద్యార్థినులు చనిపోయారని… ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో విద్యారంగంలో అమ్మఒడి సహా నాడు-నేడు ద్వారా గొప్ప సంస్కరణలు చేసి పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, టాయ్ లెట్లుతో సహా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే… కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్ధులను పరామర్శించాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన దాదాపు 170 మంది హెపటైటిస్ బారిన పడ్డం చాలా దారుణం. ఒక పాఠశాలకు చెందిన ఇంతమంది ఒకేసారి ఈ వ్యాధి బారిన పడ్డం చరిత్రలో ఎప్పుడే లేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు.ఇధి చాలా దురదృష్టకరం. నీళ్లు, ఆహారం కలుషితం కావడంతో పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించింది.
గురుకుల పాఠశాలలో పిల్లలకు కన్న బిడ్డల్లా రక్షణ కల్పించాల్సిన చోట వాళ్లకు సురక్షితమైన మంచినీళ్లు, వైద్య సేవలు అందించకుండా చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్యం వహించి వారి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే. ప్రజాసంఘాలు, ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ద్వారా జరిగిన ఈ హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్టీ కమిషన్ దీనిపై విచారణ చేపట్టాలి. హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమోటాగా విచారణకు స్వీకరించాలి. గిరిజన ఆఢబిడ్డల ప్రాణాలకంటే ప్రభుత్వానికి అలుసుగా మారింది. గిరిజన బిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?
డిప్యూటీ సీఎం జాడే కనిపించడం లేదు
గిరిజనులకు చెప్పులు, దుప్పట్లు పంచిన డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ దయార్ధ్రహృదయుడు అని వేయించుకుంటున్నారు. మరోసారి మామిడి పళ్లు పంపించారు అని మరో వార్త రాయించుకుంటారు. ఇదే పవన్ కళ్యాణ్ జలుబు అనే జబ్బుతో బాధపడుతుంటే.. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి పరామర్శిస్తారు. ఆయన ఐసీయూలో చేరుతారు.
కానీ ఇంతమంది దళితులు, గిరిజన బాలికలు చనిపోతే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? వీరి అభివృద్ధి, సంక్షేమం కోసం మీ దగ్గర డబ్బులు ఉండవు కానీ మీరు మాత్రం ఒంటేలుకు కూడా హెలీకాప్టర్ లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు.
ఇంతమంది పిల్లలు ఆసుపత్రిలో ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వారిని పరామర్శించలేదు. మీ శాఖకు సంబంధించిన ఫెయిల్యూర్ కాదా ఇది? మా నాయకుడు వైయస్.జగన్ అంటరానితనం రూపుమాపబడలేదు. రూపం మార్చుకుంది అని చెప్పారు. దాన్ని రూపుమాపడానికే నాడు-నేడు, అమ్మఒఢి, ఇంగ్లిషు మీడియం, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు, టాయ్ లెట్స్, కంప్యూటర్ విద్య వంటి అనేక సంస్కరణలు తీసుకొస్తే… అవన్నీ ఈ ప్రభుత్వంలో ఏమైపోయాయి. ఆర్వోప్లాంట్ ల నిర్వహణ లేదు, క్లోరినేషన్ లేదు దొరికిన కాడికి దోచుకుంటున్నారు.