మధ్యాహ్నం వేళ దుకాణాలు లో ..బేరాల్లేవ్..
పల్నాడు జిల్లా లో జిల్లా ప్రధాన కేంద్రం నరసరావుపేట
ప్రధాన కేంద్రం లో వ్యాపారాల్లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులు
కొనుగోలు దారులు లేక దుకాణాలు వెల వెల.
రోజు రోజు కు తగ్గి పోతున్న వ్యాపారాలతో దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్న వ్యాపారులు.
కూరగాయల మార్కెట్ రోడ్డు, మెయిన్ రోడ్డు, గాంధీ చౌక్, సత్తెనపల్లి రోడ్డు, చిలకలూరిపేట రోడ్, కుమ్మరి బజార్, నంబూరు బజార్, గీతా మందిర్ రోడ్డు గడియార స్తంభo, పల్నాడు రోడ్ మరియు రైల్వే స్టేషన్ వరకు ఎక్కడా వ్యాపారాల్లెవ్…
ఖాళీగా కూర్చుని మొబైల్ లో సినిమాలు, సీరియల్స్. లేకపోతే నాలుగు షాపులు వాళ్ళు చేరి పోసుకోలు కబుర్లుతో టైం పాస్ చేస్తున్న వ్యాపారులు దిక్కుతోచని దుస్థితి. ఇకముందు ఏమిటని దిగాలు పడుతున్న పరిస్థితి.
అద్దెలేమో ఎక్కువ
వ్యాపారాలు మాత్రం తక్కువ తక్కువ.
“టూ – లెట్” బోర్డు లతో కన్పిస్తున్న కొన్ని దుకాణాలు. ఖాళీ అయితే వేరే వారు తీసుకునే పరిస్థితి లేక..
కొద్దో గొప్పో మార్వాడిలు లేకపోతే ఊర్లో సగం షాపులు పైగా టూలేట్ బోర్డ్స్ కనబడేవి.
దుకాణాల అద్దెలు
పెట్టుబడి వ్యయం
వ్యాపారం లో పోటీ తత్వం
కార్పొరేట్ షాపింగ్ మాల్స్ భారీ గా పెరిగిన పర్యవసానం.. కనీసం విద్యుత్ చార్జీలు
నిర్వహణ ఖర్చులకు తోడు, మెట్టు ఎక్కే వారు కాన రాక దీనంగా ఉన్న వ్యాపారుల దుస్థితి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెత్తం ఇదే పరిస్థితా? లేక నరసరావుపేట పట్టణం, పల్నాడు జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి మండలంలో ఇదే పరిస్థితా?
ఒక వైపు వరుసగా వ్యాపారం లేక రియల్ ఎస్టేట్ ల వ్యాపారాలు లేక మరియు ఐపీ గోల.
అప్పు ఇచ్చే వారే లేరు.
చివరికి డైలీ చిట్ లు కూడా కట్టుకునే పరిస్తితి లేదు.
ఇదే పరిస్థితి మరో కొన్ని నెలల గడిస్తే షాపులు ఖాళీ చేసే వారే ఎక్కువ గా ఉండే అవకాశాలు లేక పోలేదు.
జిల్లాలో పేరుగాంచిన వ్యవసాయం విల విల. కొద్దో గొప్ప వర్షాలు పడి పంట బాగా ఉంది అంటే రేటు లేక రైతులు దిగాలు.
రైతులు విల విల…. షాపులలో వర్కర్స్ జీతాలు పెరిగి మెయింటెన్స్ పెరిగింది. తీరా చూస్తే వ్యాపారస్తులకు వ్యాపారాలు విలవిల.
పైవన్నీ ఒక ఎత్తు అయితే….
మేమున్నామంటూ ఆఫీసర్స్ మా టార్గెట్స్ తగ్గినవని షాపులపై రైడింగ్స్..మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.
మిర్చి, సెనగ ధర కుదేలు, రైతులు లబోదిబోమంటున్నారు,
ఏ రాష్ట్రం లో నైనా వ్యాపారం బాగుంటేనే రైతుకు సరైన ధర లభిస్తుంది. రైతు బాగుంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి.
ఇంతకు పూర్వం వ్యాపారాలు కరోనా ముందు కరోనా తర్వాత అనే వారు. ఇప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ అని వ్యాపారస్తులు బాధతో అంటూ ఉన్నారు.
వ్యాపారస్తులను ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి.
వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా ఉండి ఉంటే దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో టాక్స్ ల రూపంలో తమ వంతు పాత్ర ప్రధానమైనది.
వ్యాపారస్తులకు వ్యాపారాలు లేక టాక్స్ కట్టకపోతే, ప్రభుత్వాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి.
– కొత్తూరి కిషోర్ బాబు
చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నరసరావుపేట,
పల్నాడు జిల్లా, ఏపీ.