Suryaa.co.in

Telangana

బండి సంజయ్ తెలంగాణకి ఏం తెచ్చారో చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి

– కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: 27 వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలి.. ఇక్కడ మెజారిటీ ఎక్కువ తేవాలని అందరం కలిసి మా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధానత్య ఓటు వేసి గెలిపించండి. పట్టభద్రులు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి.మేము 8 మంది ఎమ్మెల్యేలం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మా బాధ్యతగా తీసుకుపోతున్నాం. సిరిసిల్ల లో వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిలు తీర్చడంతో పాటు అక్కడ వారికి ఉపాధి కల్పించాం. మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ఆర్డర్ ఇచ్చాం. వారికి అండగా నిలబడ్డం.

మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య రావణ కాస్టగా మారితే ఆ గ్రామ అల్లుడిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి మీరు ఏం చేశారు? మా ప్రభుత్వం బాధితులకు 4600 ఇండ్లు సాంక్షన్ చేసింది. శాతవాహన యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏర్పడింది.. కాలేజి అభివృద్ధి అనేక రకాలుగా కృషి చేశాం.. యూనివర్సిటీ కి లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ రాబోతుంది.

చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టు ఆలయం ,నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి కాబోతుంది. హుస్నాబాద్ లో గౌరవెల్లి గండి పల్లె ప్రాజెక్ట్ పూర్తి కాబోతుంది. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడితే మేం చేస్తాం అంటే మాట్లాడే పరిస్థితి లేదు.ఉత్తర తెలంగాణలోని ప్రతి జిల్లాలో మేము 50 శాతం ఉన్నాం. మొదటి ఓటు తో గెలవాలనే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. రేపు ఎల్లుండి క్షేత్ర స్థాయిలో ఓటరును కలవాలి.

బండి సంజయ్ రెండు సార్లు ఎంపీ రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది బండి సంజయ్ ఆరు ఏళ్లలో కరీంనగర్ పార్లమెంటు కి, తెలంగాణ కి ఏం తెచ్చారో తెచ్చిన తర్వాత ఓట్లు అడగాలి.నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేశానో చెప్పుకునే ధైర్యం ఉంది. పాస్ పోర్ట్ ఆఫీస్ ,తిరుపతి రైలు ,మోడల్ స్కూల్ ,కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో చేశాం.

రంజాన్ మాసంలో ఉద్యోగులకు కొంచెం ముందుగానే పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్న మీరు మాకన్నా రెండు రోజుల ముందే జీవో ఇచ్చారు. ఇక్కడ మత రాజకీయాలు చేస్తున్నారు.

LEAVE A RESPONSE