Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డిని ఓడించండి

-పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌
-ప్రకాశం కలెక్టరేట్‌ ఎదుట సర్పంచుల సంఘం ధర్నా
-కేంద్ర, రాష్ట్ర నిధులు బకాయిలతో జమచేయాలని డిమాండ్‌

జగన్‌ ఓడితేనే స్థానిక సంస్థలకు మనుగడ ఉంటుందని, లేకుంటే పల్లెలు నాశనం అవు తాయని పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆంధ్రప్ర దేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిర్వహించిన సర్పంచుల ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌, సర్పంచుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన అన్ని రకాల నిధులను బకాయిలతో సహా సర్పంచు లు బ్యాంకులో తెరిచిన పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి జగన్‌ను, వైసీపీని ఓడిరచడానికి కృషి చేయాలని అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయమని తెలుసు…మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు అందుకే అందుకే తమ ఆందోళన అని వెల్లడిరచారు. నిధులు ఇవ్వకపోవటంతో 12,918 గ్రామాల్లోని 3.50 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాం.

జగన్‌ మళ్లీ వస్తే పల్లెలు నాశనం అవుతాయి..జగన్‌ ఓడితేనే – మన మనుగడ అనే నినాదం తో ఈ రెండు నెలలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌, గౌరవ సలహాదారులు వీరభద్ర ఆచారి, ఉపాధ్యక్షుడు రావెళ్ల సుధాకర్‌, సింగంశెట్టి సుబ్బరామయ్య, కొత్తపు మునిరెడ్డి, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్‌, పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి చింతా కిరణ్‌ యాదవ్‌, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE