ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం బాధాకరం

– విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలు
-టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తున్నాను. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పిరికిపందచర్య. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయి. విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోసారి విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply