Suryaa.co.in

Telangana

చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి

-ఇది మన గడ్డ…ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదు
-సెటిలర్స్ అనే మాట తీసేయండి
-ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం….రామ రాజ్యం చూసాం
-ఎన్టీఆర్ గారు ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే ..ఆత్మ విశ్వాస రాజకీయాలు చంద్రబాబు నేర్పారు
-చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి
-శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

సెటిలర్స్ అనే మాట తీసేయండి ఇది మన గడ్డ…ఇక్కడే జీవిస్తున్నాం.. ఎవడబ్బ సొత్తు కాదు. పూజ్యులు ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం….రామ రాజ్యం చూసాం. రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం. ఎన్టీఆర్ గారు ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే ..ఆత్మ విశ్వాస రాజకీయాలు చంద్రబాబు నేర్పారు. చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి. ఐ.టీ టవర్స్….. ఔటర్ రింగు రోడ్డు…శంషా.బాద్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్రా తో విశ్వ నగరం గా పునాది వేసిన నాయకుడు చంద్రబాబు. 2020 విజన్ తో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ది చేశారు.

రాజకీయం గా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటు లో సోనియా గాంధీ చరిత్ర లో నిలిచారు. తెలంగాణ లో అహంకారం దోపిడీ మాఫీయా కబ్జా రాజ్యం గా మారింది .ప్రజా ప్రతినిధులు మాఫీయా గా మారారు . పోలీస్ లను ఎమ్మెల్యే లకు అప్ప చెప్పారు.
ప్రజా స్వామిక తెలంగాణ కోసం మార్పు కోరుతున్నారు. ఓ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలి. ఈ ఎన్నికలు చారిత్రకమైనవి.
తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి. మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి.

LEAVE A RESPONSE