రాష్ట్ర అభివృద్ధి టీడీపీ కే సాధ్యం : యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్ :అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెకించే సత్తా అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు కే ఉందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. బాపులపాడు మండలం బిళ్లనపల్లి, కొత్తపల్లి, మడిచర్ల గ్రామాల్లో బాబు ష్యురీటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నా, యువతకు నిరుద్యోగ అవకాశాలు కల్పించాలన్నా టిడిపి వల్ల సాధ్యం అవుతుందన్నారు. ఓవైపు సంక్షేమ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే సత్తా చంద్రబాబుకే ఉందని వెంకట్రావ్ తెలిపారు. జగన్ సైకోపాలనతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా కుంటుపడిందని మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ పార్కు నిర్వీర్యం కావటమే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం అన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టిడిపి ప్రభుత్వం ముందు ఉంటుందని, చంద్రబాబు ముందుచూపు వల్లె హైదరాబాద్ అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు అందరూ టిడిపికి మద్దతు ఇచ్చి టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి చలమలశెట్టి.రమేష్ ,మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు,మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వడ్డీ.నాగేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్,గుండపనేని. ఉమా ప్రసాద్ ,ఆళ్ల. గోపాలకృష్ణ,మూల్పురి. సాయి కళ్యాణి, బిళ్లనపల్లి,కొత్తపల్లి, మడిచర్ల గ్రామాల పార్టీ అధ్యక్షులు,జనసైనికులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply