Suryaa.co.in

National

మహారాష్ట్ర సంక్షోభానికి రేపటితో తెర

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి సీఎం ఉద్ధవ్‌ను ఆదేశించారు. దీనిపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బలం లేని ఉద్ధవ్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు, మరికాసేపట్లో గోవాలోని తాజ్‌లో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడతారు. అలాగే, మహారాష్ట్రలోని బీజేపీ కోర్ గ్రూప్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సంకీర్ణ శివసేన రెబల్స్‌తో కీలక చర్చలు జరపనుంది. పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, షిండే ఉప ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అలాగే, జులై 2న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

LEAVE A RESPONSE