శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు

మకర జ్యోతి దర్శనం దగ్గర పడుతున్న కొద్ది అయ్యప్ప దగ్గరికి వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చెంగనూరు నుంచి, కొట్టాయం నుంచి, నిలకల్ మీదుగా పంబకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు.

పంబానది వంతెన దగ్గర నుండి కన్నెమూల మహాగణపతి గుడి వరకు అయ్యప్పలు వేచియున్నారు. క్షణక్షణానికి నది ప్రవాహం పెరిగినట్లు అయ్యప్ప స్వాముల తాకిడి పెరుగుతుండడంతో స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది.

మండల కాలం దీక్షలు చేసి ఇరుముడులు కట్టుకొని వేల సంఖ్యలో అయ్యప్ప స్వాములు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తరలివస్తున్నారు. వచ్చిన స్వాములకు ఇక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండడంతో చాలామంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply