కేసీఆర్.. నిన్ను నంజుకు తింటం:ధర్మపురి అర్వింద్

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ చీఫ్‌పై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌పై, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెలరేగి పోయారు. మాటల దాడి చేశారు. కేసీఆర్ ఏ స్థాయిలో బీజేపీ-కేంద్రంపై దాడి చేశారో, అదే స్థాయిలో కేసీఆర్‌పై ఎదురుదాడి చేశారు. కేసీఆర్ నిన్ను నంజుకు తింటం అని హెచ్చరించారు. హుజూరాబాద్ ఓటమి ఫ్రస్టేషన్‌లో కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.

అసలు ఆయన ముఖ్యమంత్రేనా అని ప్రశ్నించారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు కింద నిన్ను లోపలేయాలి అన్నారు. ‘‘భారతసైన్యం పారిపోయిందంటావా? బీజేపీ కళ్లు ఎర్రచేస్తే భస్మమవుతవ్. హిందువులు నీ బిడ్డకు పట్టించిన గతి పదింతలు నీకు పట్టిస్తరు. సిద్దిపేటలో 2020 వరకూ 417 రైతులు నీ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్ను విడిచిపెట్టం’’ అని అర్వింద్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply