ధర్మం దానంతట అదే గెలవదు..నువ్వు గెలిపించాలి!

ధర్మం,న్యాయం,నీతి,నీజాయుతీలు ఏంత గొప్పవైన వాటికవే స్వయంగా గెలవలేవు ధర్మాన్ని అచరించే వారందరు కలిసి కట్టుగా ధర్మాన్ని తప్పక గెలిపించాలి !
అందరూ అంటుంటారు ధర్మమే తప్పక గెలుస్తుంది అని…
కాని నిజమేమిటో తెలుసా ?
ధర్మం దానంతట అదే గెలవదు.
నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి.
అర్థం కాలేదా…?
అయితే రా.. ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడూ నాయనా ..
త్రేతాయుగంలో…
రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు… రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు,, ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి తన భుజాలను, తొడ బాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి నరాలు తెగి రక్తం చిందుతున్న సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు,
యద్ధంలో గెలిచాడు…
ధర్మం గెలిచింది..!
ద్వాపరయగంలో…
కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని తానే స్వయంగా యుద్దాన్ని చేయలా
అలా అని సాదారణ మానవుల వలే యుద్దాన్కి దూరంగా లేడు ధర్మాన్ని దగ్గరుండి గెలిపించాడు..
ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిలుచున్నాడు అర్జునుడికి
రధ సారధిగా మారాడు,
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు,
దాని పేడ ఎత్తేసాడు,
స్నానాలు చేయించాడు,
ఆ యుద్ధంలో రధాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుకా అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రధాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు…
అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు…
అబద్ధం ఆడాడు,
చివరకు మోసం కూడా చేసాడు…
అవన్ని ధర్మం కోసమే చేసాడు,
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది,
ధర్మం గెలిచింది…!
కలియుగం..
ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం..
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..
అదే నువ్వు నా, ని, తన, మన బేధాలు పక్కన పెట్టి.. న్యాయం అలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది,
తెగించి అలా ధర్మం వైపు నిలబడిన రోజు, నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది.
భారత దేశ ప్రజలారా..
రండి నీతిని, నీజాయితీని, మన న్యాయం ,మన ధర్మాన్ని కాపాడు కోవడానికి,మన ధార్మికతను పరిరక్షించు కొవడానికి,చేయి చేయి కలుపుదాం పని చేద్దాం.
ఒక వానర సైన్యంలా.
ధర్మ రక్షణ కొసం శ్రీకృష్ణుడి లాగా.
తర తమ భేదాలు గాని భేషజాలు గాని ఎక్కువ తక్కువలు వదిలేసి
అందరం కలిసి కట్టుగా ధర్మాన్ని
గెలిపిద్దాం. తద్వార మనదరం కూడ గెలుద్దాం.భారత్ ను గెలిపిద్దాం .

Leave a Reply