Suryaa.co.in

Andhra Pradesh

ధర్మారెడ్డి ఈఓనా? జగన్‌రెడ్డికి బ్రోకరా?

•  జగన్ రెడ్డి కోసం తప్పుడు పనులతో అధర్మ మార్గంలో ధర్మారెడ్డి ఢిల్లీలో బ్రోకర్ పనులు చేస్తున్నాడు
• వై.వీ.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో కలిసి పవిత్ర టీటీడీని సర్వనాశనం చేశాడు
• 5 ఏళ్లుగా తాను చేసిన… చేస్తున్న పనులపై ధర్మారెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి
• అవినాశ్ రెడ్డిని హత్యకేసు నుంచి రక్షించాలని ఏకంగా కేంద్రహోం శాఖ కార్యదర్శిని సునీతారెడ్డితో ధర్మారెడ్డి మాట్లాడించింది నిజం కాదా?
• తిరుమల పవిత్రత తగ్గించేలా వై.వీ.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో కలిసి ధర్మారెడ్డి టీటీడీని సర్వనాశనం చేయడం నిజంకాదా?
• టీటీడీ ఈవోగా తనను నియమించాలనుకున్నప్పుడు తనపై ఉన్న కేసులు వివరాల్ని ధర్మారెడ్డి దాచింది నిజం కాదా?
• హైకోర్టు న్యాయమూర్తికి రూ.2కోట్ల బహుమానం ఇవ్వచూపి ఆయన ఆగ్రహానికి గురైంది నిజం కాదా?
• తనపై వచ్చిన ఆరోపణలు నిజమో ..కావో ధర్మారెడ్డే ప్రజల ముందుకొచ్చి చెప్పాలి
• రమణ దీక్షితులి దుష్ప్రచారంతో తాను గత ఎన్నికల్లో లబ్దిపొందినందునే.. అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి పింక్ డైమండ్ పై విచారణ జరిపించలేదు
• రమణ దీక్షితులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, పింక్ డైమండ్ సహా తిరుమల క్షేత్రంలో జరిగే ఆగమవిరుద్ధ కార్యకలాపాలు, కైంకర్యసేవలపై నోరు విప్పాలి
– టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రామ్ ప్రసాద్

ఆవుదూడ వెయ్యిగోవుల మధ్యలో ఉన్న తల్లిఆవు చెంతకు చేరినట్టుగానే, ధర్మం ధర్మంలోనే చేరుతుందని, పాపం ఎప్పటికీ పాపాన్నే ఆశ్రయిస్తుందనే వాస్తవం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఈవో ధర్మారెడ్డి గ్రహించాలని, 5 ఏళ్లలో తాను చేసిన దుష్కార్యాలపై ఆయనే ఆలోచించుకోవాలని టీడీపీనేత, ఆ పార్టీ బ్రాహ్మణ సాధి కార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చిరామ్ ప్రసాద్ సూచించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ పవిత్రమైన స్థానంలో ఉన్న ధర్మారెడ్డి చేయకూడని పనులు చేశారు.. చేస్తు న్నారు. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డిని బయటకు తీసుకురావడానికి ధర్మారెడ్డి ఏకంగా సునీతారెడ్డిని కేంద్రహోంశాఖ సహాయ కార్యదర్శితో మాట్లాడిం చడం…సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె వాస్తవాలు బయటపెట్టడం నిజమా ..కాదా?

టీటీడీ ఈవోగా ప్రభుత్వం తనను నియమించాలనుకున్నప్పుడు తనపై ఉన్న కేసులు వివరాల్ని ధర్మారెడ్డి దాచింది నిజం కాదా?
హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో పెళ్లికి వెళ్లి, రూ.2కోట్ల విలువైన చేతిగడియారం బహుమతిగా ఇవ్వచూపితే, సదరు న్యాయమూర్తి గారు ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం నిజం కాదా? జరిగిన ఘటనను సదరు న్యాయమూర్తి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లి, ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేసింది నిజం కాదా? ధర్మారెడ్డి గతం లో డిఫెన్స్ సర్వీసులో ఉన్నప్పుడు ఢిల్లీ కంటోన్మెంట్ లో ఆయనపై 14 కేసులు నమోదైంది నిజం కాదా? టీటీడీ ఈవోగా తనను రాష్ట్రప్రభుత్వం నియమించాలి అనుకున్నప్పుడు తనపై ఉన్న కేసుల విషయాన్ని ధర్మారెడ్డి దాచిపెట్టింది నిజం కాదా?

టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ధర్మా రెడ్డి వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది నిజం కాదా? తప్పు డు పనులు.. అపవిత్ర కార్యాలతో టీటీడీ ప్రతిష్టను ధర్మారెడ్డి మంటగలుపుతోంది నిజం కాదా? పవిత్రమైన టీటీడీఈవోగా ఉండి ఢిల్లీలో ముఖ్యమంత్రి కోసం బ్రోకర్ పనులు చేస్తున్నది నిజం కాదా? తిరుమల కొండలు, పవిత్ర క్షేత్రం యొక్క పవిత్రతను తగ్గించే చర్యలకు పాల్పడుతూ, ఐదేళ్లలో ధర్మారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కలిసి టీటీడీని సర్వనాశనం చేసింది నిజం కాదా? తాము లేవనె త్తిన ప్రశ్నలకు ధర్మారెడ్డి వెంటనే స్పందించాలి. తప్పు చేసింది లేనిదీ ప్రజల ముందుకొచ్చి ధర్మారెడ్డి ధైర్యంగా సమాధానం చెప్పాలి.

రమణ దీక్షితుల్ని అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం చేసి లబ్దిపొందినందునే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పింక్ డైమండ్ విచారణ జరిపించలేదు
రమణదీక్షితులు గతంలో జగన్ ప్రలోభాలకు లొంగే పింక్ డైమండ్ పై దుష్ప్రచారం చేసి, అది చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పారు. ఆయన చేసిన పనికి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాకూడాచంద్రబాబు ఆగ్రహించలేదు. పెద్దమన సుతో రమణ దీక్షితుల్ని వదిలేశారు. పింక్ డైమండ్ పై దుష్ప్రచారం చేయించిన జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక దానిపై ఎందుకు విచారణ జరిపించలేదు.. ఎక్కడున్నదీ ఎందుకు తేల్చలేదు. కారణం తాను రమణ దీక్షితుల ద్వారా దుష్ప్రచారం చేయించానని జగన్ కు తెలుసు కాబట్టే.

ఎన్నికలకు ముందు హిందువుల ఓట్లు దండుకోవడానికే జగన్ రెడ్డి.. రమణ దీక్షితులు లాంటి వారిని అడ్టుపెట్టుకొని లబ్ధి పొందాడు. అదే రమణదీక్షితులు నేడు తిరుమల స్వామివారి కైంకర్యసేవల్లో జరిగే లోపాలపై నోరు తెరిచినందుకు జగన్ రెడ్డి ఆగ్రహానికి గురై, ప్రభుత్వం పెట్టిన కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన అర్చకుల పదవి నుంచి తొలగించబడిన రమణ దీక్షితులు, జగన్ రెడ్డి నిర్వాకంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా మంచివారు ఎవరో.. ఎవరు ధర్మం పక్షాన ఉంటారో. .. ఎవరు హిందుధర్మాన్ని రక్షిస్తారో రమణదీక్షితులు గ్రహించాలి.

గతంలో తాను పింక్ డైమండ్ పై చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమని, జగన్మోహన్ రెడ్డి చెబితేనే తప్పుచేశానని రమణదీక్షితులు ఈనాడైనా ఒప్పుకోవాలని సూచిస్తున్నాం. ప్రజల సమక్షంలో ఆనాడు జరిగిన వాస్తవాలు.. అవాస్తవాలు బయటపెట్టాలని కోరుతున్నాం. అలా నిజాలు బయటపెట్టే ధైర్యం ఆయనకు ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నాం.

శివరాత్రి ఉత్సవాల నిర్వహణలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది
శివరాత్రి పర్వదిన ఏర్పాట్లలో, శైవాలయాల్లో జరిగే ఉత్సవాల నిర్వహణలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. గతంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లలో కూడా విఫలమై, దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల్ని తీవ్రఇక్కట్లకు గురిచేశారు. నేడు అమరావతి అమరేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు తాగునీరు, నీడకోసం షామియానాలు కూడా వేయకపోవడం నిజంగా విచారకరం. శివరాత్రి పండుగ గొప్ప పర్వదినమని, లక్షలాదిగా భక్తులు శివాలయాలకు తరలి వస్తారనే కనీస ఆలోచన కూడాలేని ఈ దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుంది.” అని బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు.

LEAVE A RESPONSE