Suryaa.co.in

Andhra Pradesh

మహిళలు, యువతుల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం

•  చంద్రబాబు మహిళా పక్షపాతి
• వైసీపీ ప్రభుత్వంలో కొరవడిన మహిళారక్షణను తిరిగి పునరుద్ధరించేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే
• ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు మహిళాదినోత్సవం సందర్భంగా ‘కలలకు రెక్కలు’ పేరుతో నూతన పథకాన్ని ప్రకటించారు
• పథకం కింద మహిళలు, యువతులు పొందే బ్యాంకు రుణానికి టీడీపీ-జనసేన ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది
• కలలకు రెక్కలు పథకం రిజిస్ట్రేషన్ కోసం 92612 92612 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.. లేదా www.kalalakurekkalu.com వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వండి
• చంద్రబాబు స్వతాహాగానే మహిళా పక్షపాతి, ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగా మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబనకు ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం
• డ్వాక్రాసంఘాలు ఏర్పాటుచేసి, మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా శక్తివంతుల్ని చేసిన ఘనత చంద్రబాబుది
• మహిళల రక్షణకోసం షీటీమ్స్, స్త్రీలు..చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయించారు
• సర్వీస్ కమిషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, వారు ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్, గ్రూప్స్ ఉద్యోగాలలో రాణించి ప్రజాసేవలో ఎదిగేలా చేశారు
– రాష్ట్ర మహిళ కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

మహిళా దినోత్సవం నాడు రాష్ట్రంలో ఎక్కడా మచ్చుకైనా కనిపించని మహిళా సంక్షేమం గురించి మాట్లాడాల్సి రావడం కించిత్ బాధగా ఉందని, జగన్మోహన్ రెడ్డి హాయాంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలకు అడ్డూఆపూ లేకుండా పోయిందని, వైసీపీప్రభుత్వంలో కొరవడిన మహిళారక్షణను తిరిగి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మాత్రమే పునరుద్ధరించగలరని టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళ లకు, తెలుగుదేశం మహిళలకు ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన వివరాలు..

“మహాశక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు సరికొత్త పథకాలు అందించాలని చంద్రబాబు నిర్ణయించారు. మహిళా సంక్షేమం.. సాధికారత..వారి ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా చంద్రబాబు తన ఆలోచనల్ని అమలు చేయబోతున్నారు. అదే విధంగా ‘కలలకు రెక్కలు పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా మహిళల కోసం ప్రత్యేక పథకాలు సిద్ధం చేస్తున్నారు.

మహిళాసాధికారతకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమే
మహిళా సాధికారతకు తొలినుంచీ తెలుగుదేశం పార్టీ అధిక ప్రాముఖ్యత ఇస్తున్నది అనేది కాదనలేని వాస్తవం. స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లో మహిళల కు 9శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆస్తిహక్కులో వారికి కూడా సమానహక్కు కల్పించారు. చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల రిజర్వేష న్లను 33శాతానికి పెంచారు. డ్వాక్రాసంఘాలు ఏర్పాటుచేసి మహిళల ఆర్థికాభివృ ద్ధికి అనేక చర్యలు చేపట్టారు. భవిష్యత్ లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడగానే మహిళా సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.

డ్వాక్రామహిళలకు మరింత స్వేచ్ఛనిచ్చి, వారి ఆర్థికపరిస్థితి మెరుగుపడేలా కొత్త ఆలోచనలకు శ్రీకా రం చుట్టనున్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. షీ టీమ్ ఏర్పాటుతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా తమ మనుగడ సాగించా రు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పూటకో అత్యాచారం, రోజుకో హత్య సర్వసాధారణంగా మారాయి.

జగన్ రెడ్డి హయాంలో మహిళలపై 2లక్షల వరకు నేరఘటనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాలకు అడ్డాగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం లోని మహిళలంతా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమకు స్వేచ్ఛ, సంతో షం లభిస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నారు. మహిళలు తనపై పెట్టుకున్న నమ్మ కాన్ని కొనసాగించేలా, మహిళల రక్షణకు ప్రత్యేకచట్టం అమలు చేయడంతో పాటు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి సత్వరమే శిక్షలు పడేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తానన్నారు. చంద్రబాబు స్వతహాగానే మహిళా పక్షపాతి.

మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలనే సద్దుదేశంతోనే చంద్ర బాబు డ్వాక్రాసంఘాలు ఏర్పాటుచేశారు. ఆయన చూపిన చొరవతో మహిళలు ఆర్థికంగా ఎదిగారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడం.. అవసరమైన నగలు కొనుక్కోవడం, తమ బిడ్డల చదువు, వివాహాలకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా చేసుకోగలిగే స్థాయికి మహిళలు ఎదిగారు. జగన్ హాయాంలో అన్నివిధాల నష్టపోయి న తన ఆడబిడ్డలకు చంద్రబాబు అనేక పథకాలు ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణం, చదువుకునే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.15వేల ఆర్థికసాయం, నెలకు రూ.1500 ఇవ్వడం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వంటి పథకాలు ప్రత్యేకంగా మహిళలకోసమే ప్రకటించారు.

మహిళలు, యువతుల కలల్నినిజం చేసి, వారి ‘కలలకు రెక్కలు’ అందించడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం
‘కలలకు రెక్కలు’ పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సరికొత్త పథకం ప్రకటించా రు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడబిడ్డ కూడా తన చదువును ఆర్థిక సమస్యలతో ఆపకూ డదనే సదుద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలే దని ఏ ఆడబిడ్డా కూడా తన విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేయకుండా, తనకు ఆసక్తి ఉన్నంతవరకు చదువుకునేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని మహిళలకు వృత్తిపరమైన ఆర్థికసాయం అందించడంతో పాటు, వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఈ పథకం ముఖ్య లక్ష్యం.

‘కలలకు రెక్కలు’ పథకం కింద మహిళలు, యువతులు తీసుకునే బ్యాంక్ రుణా లకు తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ పథకం కింద వివిధ కోర్సుల కోసం మహిళలు తీసుకునే బ్యాంక్ రుణాలకు సంబంధించిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళలు, యువతులు ఈ ప థకం పొందడానికి అర్హులు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదుచేసుకునే మహిళలు,యువతులకు పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. పథకం యొక్క రిజి స్ట్రేషన్ లింక్ పొందడానికి 92612 92612 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.

ఆసరా, చేయూత పేరుతో నమ్మిన ఆడబిడ్డల్ని జగన్ నట్టేట ముంచాడు
ఆసరా, చేయూత పేరుతో అరకొర సంక్షేమంతో జగన్ రెడ్డి నమ్మిన ఆడబిడ్డల్ని నట్టేట ముంచాడు. మహిళలు, సహా అన్నివర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. అమ్మఒడి పథకం లో విద్యార్థులకు, ఇచ్చే సొమ్ముకి కోతపెట్టాడు. డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పెండింగ్ రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని మాట తప్పాడు. గతంలో టీడీపీప్రభుత్వం మహిళలకు అమలుచేసిన తల్లీబిడ్డఎక్స్ ప్రెస్, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం వంటి అనేక పథకాల్ని జగన్ సర్కార్ రద్దుచేసింది.

కల్తీ మద్యం అమ్మకాలతో మహిళల తాళిబొట్లు తెంచుతూ జగన్ తన ఖజానా నింపుకుంటున్నాడు. అమ్మ ఒడి పేరుతో రాష్ట్రంలో జగన్ తాగుబోతు తండ్రుల సంఖ్యను పెంచాడు. ముక్కు పచ్చలారని చిన్నారులపై వైసీపీ కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడినా జగన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాడు. కల్తీమద్యంతో పాటు, గంజాయి, ఇతర డ్రగ్స్ ను రాష్ట్రంలోకి తీసుకురావడం ద్వారా, మహిళలపై దురాగ తాలు పెరిగేలా చేశాడు.

చివరకు తల్లి, చెల్లిని కూడా తన రాజకీయాలకు వాడు కొని అవసరం తీరగానే బయటకు గెంటేశాడు. తన తండ్రిని చంపిన వారిని శిక్షిం చడంకోసం పోరాడుతున్న బాబాయ్ కూతురు సునీతను నిత్యం ఏడిపిస్తున్నా డు. మహిళాద్రోహి.. మహిళా వ్యతిరేకి అయిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు నిజమైన స్వేచ్ఛ, సంతోషం, శాంతి లభిస్తాయి.

సర్వీస్ కమిషన్ ద్వారా ఉన్నతోద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలైనప్పటికీ పురుషుల్ని తలదన్నేలా తమ శక్తియుక్తులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొందరు మహిళలను తలుచుకోవాల్సిన శుభసమయమిది.

ఇందిరాగాంధీ – భారతదేశ మాజీ ప్రధాని, ఉక్కుమహిళా పేరొంది, దేశంకోసం ప్రాణత్యాగం చేసిన గొప్పమహిళ. బెనజీర్ భుట్టో: పాకిస్థాన్ మాజీ ప్రధాని, సిరిమావో బండారునాయకే : శ్రీలంక మాజీ అధ్యక్షురాలు, సుమిత్రా మహాజన్ : మాజీ రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము : ప్రస్తుత భారత రాష్ట్రపతి, జయలలిత, వసుంధరా రాజే సింధియా, మమతా బెన ర్జీ, సుష్మా స్వరాజ్, మొహసినా కిద్వాయ్, బృందా కారత్, మార్గరెట్ ఆల్వా వంటి ఎందరో మహిళలు పార్టీలకు అతీతంగా చట్టసభల్లో రాణించారు. భారతీయ మహి ళలు ఎందరో స్వాతంత్రపోరాటంలో కూడా పాల్గొన్నారు. సునీత విలియమ్స్, కల్పనాచావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లి మహిళా శక్తిని ప్రపంచానికి చాటారు.

భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న మహిళల్ని చూసి నిజంగా మనం గర్వపడాలి. వైద్యులుగా, న్యాయవాదులుగా, ఐ.ఏ.ఎస్.. ఐ.పీ.ఎస్ అధికారులుగా , గ్రూప్స్ అధికారులుగా నేడు ఎందరో మహిళలు రాణిస్తున్నారంటే దానికి కారణం టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలకు అవకాశమిచ్చారు.

భువనేశ్వరి జీవితం ప్రతి మహిళకు ఆదర్శం…
చంద్రబాబునాయుడి సతీమణి శ్రీమతి భువనేశ్వరి ప్రతి మహిళకు ఆదర్శం. గృహిణిగా, తల్లిగా, వ్యాపారవేత్తగా, తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఎందరో బిడ్డలకు మరోతల్లిగా ఆమె పోషిస్తున్న బహుముఖ పాత్ర నిజంగా ప్రశంసనీయం. ఆమె ఒక గొప్ప సంఘసేవకురాలు కూడా. అలాంటి ఆమెను ఈ ప్రభుత్వంలోని కొందరు రాక్షసులు తమ చర్యలతో అవమానించారు.

నీతిలేని దుర్మార్గులు వేసిన నిందల్ని సహనంతో భరించి, రాష్ట్రంకోసం మొక్కవోని ధైర్యంతో మందడు గు వేసిన మహాతల్లి భువనేశ్వరి. మహిళల గొప్పతనంతో ఈ ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న దుస్థితిని కూడా తలుచుకోవాలి. మహిళల సంక్షేమం కోసం.. వారి అభ్యున్నతి కోసం ఆలోచించేది, వారికష్టంలో సాయంగా, వారి బాధల్లో ఓదార్పుగా నిలిచేది చంద్రబాబు ఒక్కడే.

ప్రతి మహిళ, ప్రతియువతి సంతోషంగా ఉండాలనే సదాశయంతోనే చంద్రబాబు సహా కుటుంబసభ్యులు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ.100లు తగ్గించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం దారుణంగా పెంచిన నిత్యావసర ధరలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలపై మాత్రం స్పందించదు. ఒకచేత్తో మహిళలకు రూ.12, 13 వేలు ఇస్తున్న వైసీపీప్రభుత్వం మరోచేత్తో అదే మహిళ ల్ని కల్తీ మద్యం ద్వారా రోడ్డునపడేస్తోంది. కల్తీ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టడిచేయడం లేదో మహిళలు ఆలోచించాలి. వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలోని ప్రతి మహిళ, ప్రతి యువతి ఎంతో సంతోషంగా ఉండాలనే సదాశయంతోనే చంద్రబాబునాయుడు, లోకేశ్, భువనేశ్వరి ప్రజల్లో తిరుగుతున్నారు.” అని రాజకుమారి తెలిపారు

LEAVE A RESPONSE