టిడిపి-జనసేన సభకు అద్దె బస్సులు ఇవ్వాలి

– ఏపీఎస్ఆర్టీసీకి లేఖ రాసిన అచ్చెన్న

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున మార్చి 17న చిలకలూరిపేటలో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నాయి. ఉభయ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రజలు సమావేశానికి హాజరై తిరిగి వారి గృహాలకు వెళ్లేందుకు రవాణ సౌకర్యం అత్యవసరం.

గతంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అద్దె బస్సులు ఇవ్వాలని ఎన్నో సార్లు కోరినా ఇవ్వలేదు. అధికార పార్టీ సమావేశాలకు మాత్రం ఆర్టీసీ వారు బస్సులు పంపుతూ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీకి మాత్రం అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వమ్యంలో తగదు. ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించే నిమిత్తం అద్దె బస్సులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మరోసారి కోరుతోంది. కావున ఆర్టీసి వారు చిలకలూరిపేట సభకు అద్దె బస్సులు ఇవ్వాలని పార్టీ తరపున కోరుతున్నాం.

Leave a Reply