విజయవాడ: వైకాపా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధుసూదన్ (ధాత్రి మధు)ను పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో న్యాయస్థానం అతడికి ఈ నెల 21వరకు రిమాండ్ విధించింది. దీంతో మధును పోలీసులు జైలుకు తరలించారు.