Suryaa.co.in

Andhra Pradesh

ప్రకటనలు తప్ప…చేసింది శూన్యం

-కేంద్ర పథకాలనే వైసీపీ చెప్పుకుంటోంది
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని

పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అసలు ఏమి చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమం అబద్ధాలు ప్రచారం చేసుకోవటం కోసం పేపర్ల ప్రకటనల కోసం ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేశారని దుయ్యబట్టారు. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వాటినే చెప్పుకుంటుందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీలకు న్యాయం చేయలేద న్నారు.

డ్రగ్స్‌, గంజాయి రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకి దిగుతున్నారన్నారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సి న బాధ్యత ఉంటుంది. కొంత మంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని వాటికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష పార్టీల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్‌ సొంత జిల్లా కడపకు వెళ్లినప్పుడు 13 కంపెనీల బలగాలను రప్పించుకున్నారు.

మీకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంత భయపడుతున్నారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభ సందర్భంలో ఐదు కంపెనీల బలగాలను మాత్రమే పంపించారని హితవు పలికారు. కేంద్రం పంపిన నిధులను కూడా పక్క దోవ పట్టిస్తున్నారు.. సహజ వనరులను దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దూషణలకు దిగటం సిగ్గుచేటన్నారు. సంక్షేమ పాలన రావాలంటే కూటమిని గెలిపించాలన్సిన అవసరం ఉందని వివరించారు.

LEAVE A RESPONSE