– రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
హైదరాబాద్: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ఎండగడుతున్న దిలీప్ కొణతం అరెస్టు అక్రమం, అమానుషం. అరెస్టు చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేసు వివరాలు చెప్పకుండా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవటం ప్రశ్నించే గొంతు నొక్కడమే. ఇది ప్రజా పాలన కాదు, ముమ్మాటికీ నిరంకుశ పాలన.
కొణతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన 420 హామీలను పరిష్కరించే వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వ ప్రజావంచన విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాము.