Suryaa.co.in

Andhra Pradesh Political News

డర్టీ బాబులకు చట్టప్రకారం డర్టీ పిక్చర్ చూపించాల్సిందే!

(ఆంధ్ర ప్రవాసి )

ద్వందార్థాలు.. విపరీత వ్యాఖ్యలు.. వెకిలిచేష్టలు.. ఇవే జగన్ స్టూడియోలో కొమ్మినేని ప్రదర్శించే విద్యలు అడ్డగోలుగా నోటికి పనిచెప్పి, వెకిలిచేష్టలతో వెర్రిమొర్రి ఆనందం పొందినప్పుడు ఉండే ధైర్యం.. నమ్మకం.. ఆ చర్యల తాలూకా ప్రతిస్పందన, ప్రభావం గట్టిగా తగిలినప్పుడు కూడా ఉండాలి.

మనిషనేవాడికి భయభక్తులు ఉండాలి. అవి లేవు.. నేను ఎవరినీ లెక్కచేయను.. నాకు నేనే తోపు.. నన్ను మించినవాడు లేడని చెప్పడం ఒకరకమైన మానసిక జబ్బు అనే చెప్పాలి.

ఎవరికైనా భయం ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది.

నేడు జగన్ వీరవిధేయుడు, సోకాల్డ్ జర్నలిస్ట్.. సాక్షి ఛానల్లో ప్రధాన చర్చా నిర్వాహకుడు కొమ్మినేనిలో స్పష్టంగా కనిపించింది.

నాలుగ్గోడల మధ్య రంగురంగుల ఫోకస్ లైట్ల వెలుతురులో “”ముఖానికి బెత్తెడు మందాన నానారకాల పౌడర్లు పూసుకొని,”” కృత్రిమమైన విషపు నవ్వుతో జగన్ అవినీతి ఛానల్ లో కొమ్మినేని చేపట్టే చర్చా కార్యక్రమమే పెద్ద బూటకం.

ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు.. జరగనిది జరిగినట్టు.. జరిగింది జరగనట్టు తనకు.. తన యాజమాన్యానికి అనుకూలంగా మార్చి కట్టుకథలతో అయన కొనసాగించేది చర్చ కాదు.. అదొక వీధినాటకమనే చెప్పాలి.

యాజమాన్యం అందించిన స్క్రిప్ట్ కు తోడు.. తాను జోడించిన ద్వంద్వార్థాలు.. విపరీత వ్యాఖ్యలు.. వెకిలి చేష్టలనే జగన్ స్టూడియలో నేర్చిన విద్యలతో కొమ్మినేని ప్రదర్శించే నటన చూడాలంటే కరుడుగట్టిన జగన్ ఫ్యాన్స్ కే సాధ్యం. ఆ గుండెధైర్యం వారికి మాత్రమే ఉంటుంది.

ఎందుకంటే ఆ చర్చలో వాడే పదజాలం కంటే.. వీళ్ల మెదళ్లలో ఉండే డర్టీ లాంగ్వేజే ఎక్కువ కాబట్టి.

అలాంటి డర్టీ బాబులకు చట్టప్రకారం డర్టీ పిక్చర్ చూపించకపోతే ఓట్లేసిన ప్రజలు ఊరుకుంటారా చెప్పండి.

తన మనసులో ఉన్నది.. జగన్ అంతరంగంలోనిదే కొమ్మినేని దృష్టిలో అసలైన జర్నలిజం తనకు.. తాను పనిచేసే ఛానల్ కు ఏమాత్రం సంబంధంలేని మహిళల్ని అకారణంగా, అన్యాయంగా తూలనాడటం కొమ్మినేని దృష్టిలో తప్పుకాదట.

“తనను అన్యాయంగా అరెస్ట్ చేయడమే పెద్ద తప్పట.”

జర్నలిస్ట్ పేరుతో చర్చలో పాల్గొని.. తాను తినేది అన్నమేననే విషయం మర్చిపోయి, ఆడబిడ్డల్ని అకారణంగా అనరాని మాటలన్న కృష్ణంరాజు కూడా మంచివాడే అన్నది కొమ్మినేని ఇన్నర్ ఫీలింగ్ ఏమో?

చూడాలి రేపో.. ఎల్లుండో ఈ కొమ్మిరాజు.. ఆ కృష్ణంరాజు గురించి ఏం చెబుతాడో?

జగన్ ప్రభుత్వంలో సాక్షి టీవీలో చర్చలు జరిగినప్పుడు అందులో పాల్గొన్న సభ్యులు ఎన్నోసార్లు అడ్డూఅదుపు లేకుండా నోటికి పనిచెప్పారు.

అసలు చంద్రబాబును.. లోకేశ్ ను.. వారికి అండగా నిలిచిన వ్యవస్థలు. వ్యక్తుల్ని వెకిలిగా దూషించి తెగ ఆనందించేవారు.

వారి వైఖరి మరీ శ్రుతిమిస్తోందనిపించి, చూసి తట్టుకోలేక ఎవరైనా నేరుగా కాల్ చేసి అలా మాట్లాడతారేంటి అనడమే ఆలస్యం..

పొలోమంటూ కొమ్మినేని గొంతుచించుకునేవాడు.

ఫోన్ చేసినవాడినే తప్పుపట్టి… చర్చలో మాట్లాడినవారిని వెనకేసుకొచ్చేవాడు.

తనకు తోచినట్టు..తన మనసు చెప్పినట్టు.. సాక్షి మేనేజ్ మెంట్ సూచించినట్టు, జగన్ అంతరంగం తెలిసినివాడిగా వ్యవహరించడమే కొమ్మినేని దృష్టిలో నిజమైన జర్నలిజం.

ఆ విధమైన జగన్ జర్నలిజం సాగించే చివరకు ఈ దుస్థితికి వచ్చావు కొమ్మినేని.

రెడ్ బుక్ అమలుచేస్తున్నారు.. ప్రభుత్వ కుట్రలు… పాలకుల నిరంకుశత్వం అంటూ ప్రగల్భాలు పలకడం మానేసి, చేసింది తప్పని ఒప్పుకో.

ఎవరు నీతో తప్పు చేయించారో.. ఎందుకు చేయించారో మనసులో ఉన్నది చెప్పుకో, అప్పుడైనా మనిషిగా పుట్టినందుకు నీ జన్మకు కొంతైనా సార్థకత కలిగించిన వాడివి అవుతావు.

LEAVE A RESPONSE