– సమాజంలో తలెత్తుకుని తిరగాలని లేదా
– చేయకూడని తప్పులు చేసేశారు
– మహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరుపై టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక జర్నలిస్టు, మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం.ఆడపడుచులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోనే తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సింది
సీరియస్ గా రియాక్ట్ కావల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు వ్యంగ్యంగా కిండల్ గా నవ్వుతాడు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని వళ్లు కొవ్వెక్కి ప్రవర్తించడం హేయమైన చర్య. కొమ్మినేనిని అరెస్ట్ చేయడం తప్పు, గవర్నమెంటు పొరపాటు చేసిందని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది
అక్కాచెల్లెళ్ల ఓట్లతో ఐదేళ్లు సీఎం పదవిలో వెలగబెట్టి ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తారా వైసీపీకి వచ్చిన 40 శాతం ఓట్లలో మహిళలవి లేవా? అమరావతి ఆడపడుచుల్లో ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేయలేదని భావిస్తున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని వ్యాఖ్యానించడం మరింత దురదృష్టకరం.
తల్లులు, అక్కచెళ్లెళ్ల గురించి ఇంత హీనంగా మాట్లాడటానికి వైసీపీ నేతలకు మనస్సు ఎలా వస్తుందో? సీఎంగా, కేబినెట్ ర్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. సమాజంలో ఎలా తలెత్తి తిరగాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
నేను ఒక టీడీపీ ప్రజాప్రతినిధిగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. వైసీపీ నాయకుల తీరు చాలా సహించరాని విషయం…సమాజంలో చేయకూడని తప్పులు చేసేశారు మనుషులుగా మాట్లాడుతున్నారో…మృగాలుగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.. వైసీపీ నేతల తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.