Suryaa.co.in

National

దేశంలోని ఏ సీఎంకి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయి

– ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం లీడర్ గా రాణిస్తున్న లోకేష్ బాబు
– తెలంగాణలోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయం
– తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడివుంటాను
– ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి ఇక్కడి తెలుగు ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నందమూరి తారక రామారావు 302 సినిమాల్లో నటించారు…అందులో 270 సినిమాలు హిట్.94 సినిమాలు 300 రోజులు ఆడగా, 185 సినిమాలు 175 రోజులు ఆడాయి.

1962లో నెల్లూరులో మా కుటుంబ పెద్దలు శ్రీనివాసమహల్ థియేటర్ ను ప్రారంభించారు.ఆ థియేటర్ లో ఎన్టీఆర్ నటించిన వెంకటేశ్వర మహత్త్యం సినిమాను చూడటం ఇంకా గుర్తుంది..ఇంకా అనేక సూపర్ హిట్ సినిమాలు చూశాం.1983 నుంచి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. 1991లో దూబగుంట రోశమ్మ సారథ్యంలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమానికి అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ గా వ్యవహరించాను.

ఉమ్మడి ఏపీలోని అన్ని జిల్లాల్లో సారా వేలం పాటలు నిర్వహించగా, ఒక్క నెల్లూరు మాత్రం జరగకుండా అడ్డుకున్నాం. అప్పట్లో ఎన్టీఆర్ ను కలిసి ఉద్యమం గురించి వివరించాం. మా ఆహ్వానం మేరకు నెల్లూరుకు వచ్చిన ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు.ఎన్టీఆర్ ఇచ్చిన ఆ హామీతో అప్రమత్తమైన అప్పటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు నెలల్లోనే సారా నిషేధం అమలులోకి తెచ్చారు.

1994లో అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు.రాష్ట్రం ఆదాయం కోల్పోతుందనే ఆందోళన ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. 2019 ఎన్నికల సందర్భంగా వైసీపీకి ఓట్లు వేస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఆ మద్యంతోనే వ్యాపారం చేశాడు.

సిట్ విచారణలో రూ.3200 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. అనధికారికంగా జరిగిన విక్రయాలను లెక్కిస్తే ఏపీ లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు పైగానే. మద్యం స్కామ్ జరుగుతోందని నేను 2019 నుంచి ఏటా ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూనే వచ్చాను..ఈ రోజు సిట్ విచారణలో అదే తేలింది.

నటుడిగా సినిమాల్లో అలుపెరగకుండా పనిచేసిన ఎన్టీఆర్ అధికారం చేపట్టగానే పేదలకు పింఛన్ ఇవ్వాలని సంకల్పించారు. ఒక్క పింఛనే కాదు..మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, సింగిల్ విండో వ్యవస్థ, మండలాల ఏర్పాటు, రైతులకు హార్స్ పవర్ కరెంట్ రూ.50కే తదితర ఎన్నో పథకాలు, వ్యవస్థలను ఆవిష్కరించారు.

తెలుగు గంగ ప్రాజెక్టుతో ఆ రోజుల్లోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు కృష్ణా జలాలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు ప్రజలతో పాటు చెన్నైకి తాగునీరు ఇవ్వడం ఎన్టీఆర్ ఆలోచనలతోనే సాధ్యమైంది.దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఎన్టీఆర్ కు వచ్చాయి.

ఆ రోజుల్లో విమానంలో ప్రయాణిస్తుంటే పేదల ఇళ్లు శ్లాబులతో కనిపిస్తే అది ఏపీ అని ఒక కేంద్ర మంత్రి చెప్పారంటే ఎన్టీఆర్ చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం పుణ్యమే. రైతులకు 7 శాతం వడ్డీకే రుణాలు..సకాలంలో చెల్లిస్తే 5 శాతమే వడ్డీ వంటి పథకాలు అందించారు

ఎన్నో మంచి పనులు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేసే అదృష్టం నాకు లభించింది. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో మూడు సార్లు మంత్రిగా వ్యవహరించా

నారా లోకేష్ బాబుతోనూ కలిసి మంత్రిగా పనిచేశా..ఇప్పుడు వారితో కలిసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. యువగళం పాదయాత్రతో లోకేష్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం హీరోగా నిలిచారు. తెలంగాణలోనూ టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం

LEAVE A RESPONSE