– రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి
రాజానగరం: సాక్షి చానల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి అన్నారు. రాజానగరం సాక్షి కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గ మహిళలు నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా మజ్జి పద్మ మాట్లాడుతూ ఇటీవల సాక్షి టీవీ లో కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షో లో విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతి రాజధాని ని వేశ్యల రాజధాని గా మాట్లాడం చాలా అన్యాయమని ఇది కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో అమరావతి రాజధాని ప్రతిష్ట దిగజారే విధంగా వేశ్యల రాజధానిగా అభివర్ణించడం చాలా దురదృష్టకరం అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పైన సాక్షి ఛానల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. సాక్షి దినపత్రిక నడుపుతున్నటువంటి వైయస్ భారతి ఆంధ్రప్రదేశ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దండమూడి ప్రమీల, బైరెత్తి సరోజిని, బండి నాగమణి, పాలపర్తి రత్నం, పత్తి మంగ, బొమ్మిడి శ్రీదేవి, అనంతలక్ష్మి, పెంట కుమారి, రాయుడు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.