(బాబు భూమా)
సాక్షి మీడియా యాజమాన్యానికి,
PLOS గ్లోబల్ హెల్త్ సంస్థ ఇటీవల భారతదేశంలో సెక్స్ వర్కర్ హాట్‌స్పాట్‌లపై ప్రచురించిన నివేదిక మీ కళ్లకు అందనిదా? దీని సారాంశం, గణాంకాలు మీ మీడియాలో చర్చకు రానిదా?
నివేదికలోని కీలక గణాంకాలు (PLOS గ్లోబల్ హెల్త్):
భారతదేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో అత్యధిక శాతం కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు.
దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4% కర్ణాటకలో ఉన్నారు.
12% ఆంధ్రప్రదేశ్‌లో, 7.6% తెలంగాణలో ఉన్నారు.
దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో దాదాపు 20% మంది తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)కు చెందినవారే.
మహారాష్ట్ర (9.6%), ఢిల్లీ (8.9%) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 53% మంది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ – ఈ ఐదు రాష్ట్రాలకు చెందినవారే.
ఈ అధ్యయనం 32 రాష్ట్రాలు, దేశంలోని అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించబడింది.
దేశవ్యాప్తంగా 96,193 మంది ట్రాన్స్‌జెండర్లు సెక్స్ వర్క్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది, వీరిలో 90.8% మంది హాట్‌స్పాట్‌లలోనే ఉన్నట్లు వెల్లడైంది.
పురుష సెక్స్ వర్కర్ల సంఖ్యలో తెలంగాణనే అగ్రస్థానంలో ఉంది.
మీ చర్చలు, మీ డొల్లతనం!
ఇది కేవలం ఒక నివేదిక సారాంశం. ఈ నివేదికలో కనబరిచిన సర్వేను మన దేశంలో ఎలా చేసి ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా? దక్షిణాదిన చేసిన పద్ధతులు ఉత్తరాదిన వర్తిస్తాయని మీరు అనుకుంటున్నారా? అంత ధైర్యంగా వెళ్లి నిజాలు ప్రకటించగలరా?నేడు బెంగళూరు మాత్రమే కాదు, హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాలలోని జిల్లా కేంద్రాల వరకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. పెట్రోల్ బంకుల్లో గాలి పట్టడం నుండి హోటళ్లలో పని చేయడం వరకు ఉత్తర భారతదేశం వారు దక్షిణాదిన పనిచేయడం మనం గమనించవచ్చు.
మరి మీ ప్రశ్నలు, మీ ప్రమాణాలు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్‌లో పని దొరక్క కర్ణాటకలో పనికి వెళ్లేవారిని అలా అనవచ్చా? ఆ లాజిక్ ప్రకారం, మీ వైకాపా అధినేత, మీ సాక్షి యాజమాన్యం ఇక్కడా అక్కడా పనిచేసుకుంటున్నారు కదా?
నేడు అమరావతి గురించి మాట్లాడిన ‘ఊరకుక్కలు’ వ్యక్తిగత దూషణలకు దిగితే వ్యక్తిగతం అని సరిపెట్టారు, రేపు మీ గురించి ఇలాగే జనరలైజ్ చేసి మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అని ఊరుకుంటారా? లేక ‘కదిరికి గొడ్డలిని’ కొనడానికి పంపిస్తారా?
మీరు ఇప్పటికీ ‘సీనియర్ జర్నలిస్ట్’ అని పేర్కొంటున్న మాట మీరిన ఎదవకు అనుభవ హోదా ఇవ్వడం అంత అవసరమా?
జగన్ హయాంలో ‘అదృశ్యం అయిన మహిళల’ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, బూతులు మాట్లాడకుండా మీరు సమాధానం చెప్పిన ఒక్క రోజు ఉందా?
ఈ పరిస్థితి ఈ ఏడాదిలో వచ్చి, నిన్న మొన్న ఆ సర్వే చేశారా? ఈ ఐదేళ్ల మీ పాలనలో ఇది సమస్య కాదా?
ఈ ఐదేళ్లలో ‘దేవతల లెక్కన’ అమరావతి తాడేపల్లిలో సెట్టింగులు వేసుకొని పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం ‘ఫోటో షూట్ దర్శనం’ ఇచ్చిన మీ నాయకులకు ఈ నివేదిక వర్తిస్తుంది అని ఎందుకు పరిగణించలేదు? కొమ్మినేని నుండి కృష్ణంరాజు వరకు ఎందుకు బహిష్కరించినట్లు క్షమాపణలతో ప్రకటించలేదు?
అమరావతి – ఒక పోలిక, మీ ఉన్మాదం!
పురాణాలలో దేవతల అమరావతిలో కూడా అప్సరసలు ఉండేవారు. తపస్సు చేసే వారిని తమ అందచందాలతో రంభ, ఊర్వశి, మేనక వంటి 31 మంది అప్సరసలు ‘వినియోగించబడ్డారు’ అని పురాణాలలో ఉంది.
భువిలో అమరావతి అనగానే… ఆ పోలికను తట్టుకోలేక, ‘ఉన్మాద జర్నలిస్టుల’ చర్చను లైవ్ టెలికాస్ట్ చేసి, మొట్టమొదటిసారిగా ‘అది వారి వ్యక్తిగతం’ అని ఖండించారు సరే. రేపు మీ ప్యాలెస్‌లు ఉన్న రెండు అగ్ర సెక్స్ రాజధానులలో నివసించే మీ గురించి ఇలాగే జనరలైజ్ చేసి చెబితే, ఇలాగే ‘వారి వ్యక్తిగతం’ అని ఊరుకుంటారా?
మీరు ఈ ప్రశ్నలకు స్పందిస్తారని ఆశిస్తున్నా.