విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చించాం

– పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు
– బీజేపీ నేత పురందేశ్వరి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చించాం. ప్రత్యామ్నాయ మార్గాన్ని అగ్రనాయకత్వం ముందుంచాను. తెలంగాణలో పెండింగ్ బకాయిల అంశానికి త్వరలో పరిష్కారం. పోలవరానికి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తోంది . పోలవరం ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదు. టీడీపీ హయాంలోనే పనులు నత్తనడకన సాగాయి . పనుల ఆలస్యానికి కేంద్రం కారణమని చెప్పడం సరికాదు. పోలవరానికి ప్రతిపైసా కేంద్రం నుంచే వస్తోంది . బిల్లుల విషయంలో ఏవైనా అనుమానాలుంటే ఆలస్యమవుతోంది. పోలవరానికి అన్యాయం చేసే ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.

Leave a Reply