Suryaa.co.in

Telangana

అవతరణ వేడుకలో పద్మశ్రీకి అవమానం

– దూరంగా నిలబడి వేడుక చూసిన గడ్డం సమ్మయ్య
– వేడుకకు ఆహ్వానం లేని పద్మశ్రీ అవార్డు గ్రహీత
( అన్వేష్)

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు రూపొందించారు. కళ్లు చెదిరే లైటింగ్ ఏర్పాటుచేశారు. కానీ ఈ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినా హాజరుకాలేదు. అది వేరే ముచ్చట. మరి వేడుకకు హాజరయిన ప్రముఖులను సర్కారు ఏమైనా గౌరవించిందా అంటే అదీ లేదు. ట్యాంక్‌బండ్‌పై వేడుకను చూసేందుకు తెలంగాణ చుట్టుముట్టూ ఉన్న యక్షగాన కళాకారులు తరలిచ్చారు. అందులో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య ఒకరు. పాపం ఆయనకు ఆహ్వానం లేదు. అలాగని ఆయనను అక్కడ గుర్తుపట్టేవారూ లేరు. దానితో ఆ పద్మశ్రీ అవార్డు గ్రహీత.. అలాగే నిలబడి ఆ కార్యక్రమాలు వీక్షించాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ వీడియోను చూస్తే కాంగ్రెస్ సర్కారు కళాకారులకు ఎంత చక్కటి గౌరవం ఇస్తుందో అర్ధమవుతోంద’ని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A RESPONSE