స్త్రీలను అగౌరవ పరచడమేనా వైసిపి అధినేత చెబుతున్న మహిళా సాధికారత.?

Spread the love

– ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి ప్రణవ్ గోపాల్.
తల్లిని చెల్లిని గౌరవించలేని వాడు ఇతర స్త్రీల పట్ల మర్యాదగా ఏ విధంగా నడుచుకోగలడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా తన తల్లి వయసున్న ఒక స్త్రీని అవమానకరంగా మాట్లాడుతుంటే హేళనగా నవ్వే సంస్కార హీనుడు జగన్ మోహన్ రెడ్డి.అధికారం కోసం సొంత బాబాయినేపొట్టనబెట్టుకున్న మీకు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?
వైసీపీ ప్రభుత్వ పతనానికి సమయం దగ్గర పడింది గనుకే ప్రతిపక్ష నేత సతీమణిని దారుణంగా అవమానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేకే చంద్రబాబు గారి సతీమణిని వ్యక్తిగతంగా అవమానించారు.జగన్ రెడ్డిది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. అందుకే ఈ రాష్ట్రానికి చవటలు ,సన్నాసులు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు తెప్పించిన జగన్ రెడ్డికి పతనం ప్రారంభమైంది.

Leave a Reply