-3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు
-సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జొన్నలు పంపిణీ
-రేషన్ కార్డుదారులకు శుభవార్త
అమరావతి: రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త . జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా, మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేయనున్నారు. రాగులు, జొన్నలు వద్దనుకునేవారు పూర్తిగా బియ్యం తీసుకోవచ్చు.