Suryaa.co.in

Features

దీపావళి బౌద్ధం పండుగ కాదు

దసరాను బౌద్ధం పండుగ అని ‘చదువు’ లేకుండా ప్రేలాపన చేసిన విద్వేష వాదులు, బౌద్ధ భ్రష్టులు (అంటే బౌద్ధులు భ్రష్టులు అని కాదు బౌద్ధం పేరుతో లోపాయికారీ లబ్ది పొందుతూ వైదికత్వంపై దాడి చేస్తున్న భ్రష్టులు అని అర్థం) ఇక దీపావళిని బౌద్ధం పండుగ అని తమ వికృత మేధను వాంతి చేసుకుంటారు. హిందువులు జరుపుకునే పండుగలు బౌద్ధం నుంచి వచ్చాయి అనడం బౌద్ధోన్మాదం.

దీపావళి బౌద్ధం నుంచి వచ్చిందా?

దీపావళి పండుగ గురించి అంతర్జాతీయమైన ‘చదువు’తో మనం తెలివిడిలోకి వెళదాం.

1. “దీపావళి శ్రీ లక్ష్మీ దేవతకు సంబంధించిన పండుగ” అని Geoffrey Parrinder తన A Dictionary Of Non-Christian Religions లో మౌలికంగా తెలియజేస్తూ ఇలా వివరిస్తున్నారు:

Dipàvalì – The cluster of lights, or Feast of lamps at the end of the Hindus old year at the beginning of the new. It comes in october-november at the end of Ashwina, and is particularly associated with the goddess Lakshmi, the consort of the great god Vishnu, and goddess of wealth. Houses are cleaned and decorated, vessels polished, new cloths put on and homes illuminated with oil lamps. on the second day ghosts and witches are said to be abroad and people stay at home or recite spells to lay the spirits. But on the third day people rise early, children let off crackers, bigger lights are lit, and friends are entertained. Businessmen open new account books for the new year and write the word Shri for Lakshmi over and over again to bring good fortune. For them, especially in western India, it is the most important of all festivals.
ఈ అంతర్జాతీయ అధ్యయనాన్నిబట్టి దీపావళి బౌద్ధం నుంచి రాలేదని నిర్ద్వంద్వంగా తెలియవస్తోంది.

2. THE USBORNE ENCYCLOPEDIA OF WORLD RELIGIONS
దీపావళి గురించి ఇలా చెబుతోంది:

Diwali is a five-day festival that takes place between October and November. It is a time when Hindus worship Lakshmi, the goddess of wealth and beauty. The festival also celebrates the triu mphant return from exhile of Rama, accompanied by his wife Sita. Diwali marks the begining of the new year.

The name Diwali comes from the Sanskrit word Dipavali, which means “lights”. Light represents knowledge , and the triumph of good over evil. Diwali is often known as the “festival of lights”. Houses and temples are decorated with small clay lamps called diyas, and people set off fire works to drive away the darkness, and to light the path home of Rama and Sita.

Before Diwali, houses are cleaned thoroughly then decorated for the festival. It is thought that Lakshmi will enter a clean and beautiful house, and bless those who live there…”

రామాయణ కాలానికే దీపావళి ఉంది అని అంతర్జాతీయంగా తెలిసిన నిజం. రామాయణం బుద్ధుడికి ఎంతో పూర్వానిది. దీపావళి బౌద్ధం నుంచి వచ్చిందనడం మూర్ఖత్వం, ఆపై విద్వేష వాదం.

3. Checkmark Books, Newyork ప్రచురించిన ENCYCLOPEDIA OF HINDUISM కూడా దీపావళి సనాతనపు పండుగ అని వివిధ ఘటనల్ని ఉటంకిస్తూ తెలియజెప్పింది.

దీపావళి, అన్ని అధ్యయనాల ప్రకారం హైందవం పండుగ, మరొకటి కాదు. దీపావళి బౌద్ధం పండుగ కాదు అన్నది సరైన తెలివిడి. మామూలు మనుషులుగా బతకలేక, సమాజానికి ఏ మాత్రమూ ఉపయోగపడలేక రక్తపు కూడును మరిగి ఆపై లోపాయకారీ కారణాలతో, విధ్వంసక భావజాలంతో బుద్ధుడు, బౌద్ధం అంటూ సనాతనత్వం మీద దాడిచేసే దుష్టులకు అతీతంగా, అంతర్జాతీయ అవగాహనతో మనం మన సంస్కృతితో, సంస్కృతిలో కొనసాగుదాం.

“అర్థం చేసుకోలేకపోతే ఒక నిజం వ్యర్థం అయిపోదు; నిజాన్ని అర్థం చేసుకోలేకపోతే ఒక వ్యక్తి వ్యర్థమైపోతాడు”

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE