Suryaa.co.in

Andhra Pradesh

జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా?

-ప్రిజనరీ జగన్ కు విజన్ ఉందంట
-జగన్ ది దరిద్రపు పాదం
-ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి
-నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది
-బాబాయిని లేపేసింది ఎవరు?
-100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి
-బీసీల బ్యాక్ బోన్ విరగ్గొట్టాడు సైకో జగన్
-హలో ఏపీ.. బైబై వైసీపీ
-హిందూపూర్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

సభికులను నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. నేడు 8వ వింత వచ్చింది. ప్రిజనరీ జగన్ కు విజన్ ఉందంటా? జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా గంజాయి, ఇసుక దొబ్బేయడంలో, మద్యంలో అక్రమాలకు పాల్పడటంలో విజన్ ఉంటుంది. గనులు, సెంటుపట్టాలో ఎలా డబ్బులు లేపేయాలో విజన్ ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి.

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. విశాఖకు మూడు పనులు చేశారు. మొదటిది రూ.500 కోట్ల ఖర్చుతో ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్ రూమ్ కమ్ బోర్డు ఖర్చు రూ.25 లక్షలు. విశాఖలో బస్ షెల్టర్లు కట్టారు. గట్టిగా గాలి వస్తే కూలిపోతున్నాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే వారంలోనే పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తాను, విజన్ ఉందని చెబుతున్నారు.

జగన్ ది దరిద్రపు పాదం. ఆయన మొదటిసారి వస్తానంటే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి. నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది.

ఉత్తరాంధ్ర నుంచి ప్రమాణస్వీకారం చేస్తానంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంతిమయాత్ర చేయడానికి. గ్రాఫిక్స్ తో కొత్త భవనాన్ని చూపించాడు. అది కోడికత్తి బ్రాండ్. ఒక డిజైన్ చూపించాడు. నేనే ఆశ్చర్యపోయాను. అది సాక్షి ఆఫీసు నుంచి గ్రాఫిక్స్ పంపించారు. కోడికత్తి తప్పితే వారికేం తెలుసు?

బాబాయిని లేపేసింది ఎవరు? జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పైనున్న ముగ్గురు. నాలుగో ఆప్షన్ కరెక్ట్. ముందు గుండెపోటు అన్నారు. తర్వాత శవానికి కుట్లు వేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. చంద్రబాబు చేతిలో గొడ్డలిపెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. అబద్దం ప్రపంచం చుట్టి తిరిగివచ్చింది. కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత నిజాలు బయటకు చెప్పారు. హంతకులు పాలకులు అయ్యారని, జగన్ కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు సునీత.

విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను అనే మా అన్నవి అన్నీ అబద్ధాలే అని చెప్పారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ ను ఓడించాలని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వస్తే జగన్ రెడ్డి అడ్డం పడ్డారని ఆమె చెప్పారు. వీటన్నింటికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆమెకు న్యాయం జరగాలి. రెండు నెలలు ఓపిక పడితే మేం న్యాయం చేస్తాం.

సొంత తల్లి, చెల్లిని జగన్ రెడ్డి మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి మనకు న్యాయం చేస్తాడా అని ఆలోచించాలి.సైకో జగన్ అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. బల్లపైన బులుగు బటన్. బల్ల కింద రెడ్ బటన్. బల్లపైన బటన్ నొట్టి రూ.10 అకౌంట్ లో వేసి రెడ్ బటన్ తో 100 లాగేస్తారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, క్వార్టర్ బాటిల్, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు.

ఇక కటింగ్ మాస్టర్.. అన్న క్యాంటీన్ కట్, పెళ్లికానుకలు కట్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, డ్రిప్ ఇరిగేషన్, 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్. 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ రెడ్డి.

పవనన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్-6 హామీలు ప్రకటించారు.మొదటిది నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45 వేలు వస్తాయి. ప్రతి రైతుకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి రూ.20వేలు మన ప్రభుత్వం ఇస్తుంది.

ప్రతి ఇంటింకి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది.ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం.

జగన్ ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఎన్నికలకు ముందు బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఇప్పుడు ఏకంగా బీసీల బ్యాక్ బోన్ విరగ్గొట్టాడు ఈ సైకో జగన్.26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టారు, 300 మంది బీసీలను హత్య చేశారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం? రెండు నెలలు ఓపిక పట్టండి… బీసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తాం.

అమర్ నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య లాంటి అనేక మంది బీసీలను ఈ ప్రభుత్వం హత్య చేసింది. బీసీలకు రావాల్సిన రూ.75వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్లు తగ్గించారు. బీసీ సోదరుల గొంతు విన్నాం. అందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించాం.

50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4వేలు పెన్షన్ అందించబోతోంది మన ప్రభుత్వం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేస్తాం. బీసీలకు సబ్ ప్లాన్ కింద ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు మన ప్రభుత్వం ఖర్చుపెడుతుంది. స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతాం. ఆదరణ పథకం కింద 5వేలు కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందిస్తుంది మన ప్రభుత్వం.

చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు, బీసీ సోదరులకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది.
ఆనాడు కమ్యూనిటి భవనాల పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఆగిపోయాయి. మన ప్రభుత్వ ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లో పూర్తిచేస్తాం.

అనంతపురం జిల్లా ప్రజలు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారి దగ్గరి నుంచి చంద్రబాబు గారి వరకు ఎంతో ప్రేమ చూపిచారు, అందుకే టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు. కరవు జిల్లాలో ఏకంగా కార్లు తయారుచేసే పరిశ్రమ తీసుకువచ్చిన విజనరీ చంద్రబాబునాయుడు. కియా అనుబంధ సంస్థల ద్వారా50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే కల్పించారు. ఐదేళ్లలో లక్షా 30వేల మంది రైతులకు 90 శాతం సబ్సీడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం.

కరవు వస్తే రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించి పంటలను కాపాడాం. ఒకే సంవత్సరం ఇన్ పుట్ సబ్సీడీ ద్వారా రూ.2వేల కోట్లు రైతులకు అందజేశాం.
జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్-2, హెచ్ఎల్ సీ హైలెవన్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ పనులు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ.

2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగిషేన్ పథకాన్ని రద్దు చేశాడు ఈ సైకో జగన్. 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని కరవు అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్ రెడ్డిది. రైతులకు కనీసం ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వడానికి కూడా చేతులు రాలేదు.

పట్టు రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గాలికి వదిలేశాడు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదు. మన ప్రభుత్వంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేసేవాళ్లం. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక నేడు మూడు లక్షల ఎకరాలకు పడిపోయింది.

హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పి తట్టమట్టి కూడా వేయలేదు. హెచ్ ఎల్ సీని ఆధునీకరిస్తామని చెప్పి రూపాయి ఖర్చుపెట్టలేదు. టీడీపీ హయాంలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టును ప్రారంభిస్తే జగన్ రెడ్డి వెళ్లి మళ్లీ శిలాఫలకాలు వేశాడు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా ఉన్నాయి.

ఆనాడు రూ.840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును మన ప్రాంతానికి తీసుకువచ్చాం. నేడు రద్దు చేశాడు సైకో జగన్.రోడ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, తాగు, సాగునీటి పథకాలు టీడీపీ హయాంలోనే నిర్మించచడం జరిగింది. టీడీపీకి కంచుకోట అంటే గుర్తుకువచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్. మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది హిందూపూర్ నియోజకవర్గం.

ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత హిందూపూర్ నియోజకవర్గానికి దక్కుతుంది. మా మావయ్య హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించిన నియోజకవర్గం హిందూపూర్. రెండో మామయ్య, నందమూరి బాలకృష్ణని రెండు సార్లు శాసనసభకు పంపించిన ఘనత ఈ హిందూపూర్ ది.టీడీపీ హయాంలో హిందూపూర్ ను పెద్దెఎత్తున అభివృద్ధి చేశాం. ఆనాడు బాలకృష్ణ రూ.2వేల కోట్లు ఖర్చుపెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేశారు.

గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు.పంటకుంటలు తవ్వారు. సీసీ రోడ్లు వేశారు. ఆసుపత్రులు అప్ గ్రేడ్ చేశారు. తాగునీటి ట్యాంక్ లు ఏర్పాటుచేశారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించారు. నేను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలయ్య బాబు నుంచి కాగితం రావడమే ఆలస్యం.. వెంటనే సంతకం పెట్టి శాంక్షన్ చేసే పంపేవాడ్ని.

ఇక ఇరిగేషన్ శాఖ నుంచి కూడా అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చాం. టిడ్కో కింద 2800 ఇళ్లు కట్టించిన ఘనత బాలయ్యది. బీసీ సోదరులకు, ఎస్సీ, ఎస్టీ సోదరులకు లోన్లు ఇవ్వడం జరిగింది. లేపాక్షి ఉత్సవాలు, కోవిడ్ సమయంలో 3కోట్ల 50 లక్షల సొంత నిధులుతో వెంటలేటర్లు, కిట్ లు పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్య.

అన్న క్యాంటీన్లు కూడా మళ్లీ ప్రారంభించారు. ఆరోగ్య రథం, బసవతారకం క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకువచ్చారు.బ్రహ్మణి దగ్గర నుంచి సీఎస్ఆర్ ఫండ్లు మొత్తం హిందూపూర్ నియోజకవర్గానికి ఖర్చుపెట్టారు.మన బాలయ్య బాబు నీతి, నిజాయతీగా పరిపాలన అందించారు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా.. ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.

ఏపీలోనే ఎవరికి రాని భారీ మెజార్టీతో బాలయ్య బాబుని గెలిపించి శాసనసభకు పంపించాలని కోరుతున్నా.వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపూర్ కు చేసిందేమిటి? సంవత్సరానికో ఇంఛార్జ్ వస్తాడు, వెళ్తాడు. ఇసుక, గ్రావెల్ లో డబ్బులు దొబ్బుతారు, వెళ్తారు.వైసిపి నాయకులు ఆనాడు హిందూపూర్ ను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేస్తానన్నారు, హిందూపురానికి మెడికల్ కాలేజీ తీసుకువస్తానన్నారు, అవేమీ రాలేదు.

కానీ మా జిల్లా నుంచి ఒకడొచ్చాడు. వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరును క్యాన్సర్ లా తినేస్తున్నాడు.అక్కడ నేను పాదయాత్ర చేసేప్పుడు ఎక్కడికి వెళ్లినా పిఎల్ఆర్ పేరుతో టిప్పర్లు ఉంటాయి. ఆ టిప్పర్లను ఎవరూ ఆపరు. ప్రతి టిప్పర్ లో ఇసుక, మద్యం ఫుల్. ఏకంగా గ్రావెల్ కూడా కొట్టేస్తున్నారు. మన నియోజకవర్గానికి రానిస్తే క్యాన్సర్ గడ్డలా తినేస్తారు. చిత్తూరు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడకు వస్తే తరిమితరిమి కొట్టాలని పిలుపునిస్తున్నా.

నాపై 22 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఏమీ చేయలేకపోయారు.ఇక మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తిచేస్తాం. పట్టణంలో ట్రాఫిక్ సమస్య, రోడ్లు మెరుగుపరుస్తాం. భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం.ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తాం, హిందూపురాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం, లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

టీడీపీ బలం టీడీపీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారు. వైకాపా కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కావాలి. మనకి చంద్రబాబు గారి పిలుపు రా.. కదలిరా.. అంటే చాలు.. పరిగెత్తుకుంటూ వస్తారు.2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటుచేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల బీమా అందజేసి ఆదుకున్నాం. ఇందుకు 100 కోట్లు ఖర్చుపెట్టాం.

పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తోంది నా తల్లి భువనేశ్వరమ్మ. అది కార్యకర్తల పట్ల మా చిత్తశుద్ధి. నాకు అక్కచెల్లెళ్లు లేరు, అన్నాదమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములను ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడతా. 2019 నుంచి మనపై అనేక కేసులు పెట్టారు. ఎవరిపైన ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి అంతపెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాం.

చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టను. వారి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. సుప్రీంలో కూడా దీనిపై చర్చ జరిగింది. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది. మొదట జైలుకెళ్లేది పాపాల పెద్దిరెడ్డి. ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు మన రాముడు. కానీ వైకాపాకు లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా చెల్లిస్తాం.

నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. బాబు గారిని అక్రమంగా రిమాండ్ కు పంపినప్పుడు నాకు మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవనన్న. ధైర్యంగా ఉండాలని, అండగా నిలబడతానని చెప్పారు.పవనన్న ఏపీకి వస్తుంటే విమానానికి పర్మిషన్లు క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో వస్తుంటే బోర్డర్ లో ఆపేసి మూడు గంటలు ఇబ్బంది పెట్టారు. అందుకే పవనన్న నిర్ణయించుకున్నారు.. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ ను ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలని.

టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తారు. వారి కుట్రలను అడ్డుకోవాలి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలి.. హలో ఏపీ.. బైబై వైసీపీ.పార్టీ కార్యక్రమాలు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల్లో బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇవ్వడం జరిగింది. బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నా. బాగా పనిచేసిన వారి దగ్గరకి నేనే వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదువులు ఇస్తాం.

LEAVE A RESPONSE