నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా?

మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక, శారీరక రోగాలు పోతాయి

రాత్రి గాఢనిద్రపోయి ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, దేశంలో నిన్న రాత్రి లోపు అనారోగ్యం వచ్చిన, పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడివన్న మాట. నువ్వింత వరకు కరువులో శరణార్దుల శిబిరాన్ని కాని చూడలేదంటే, ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే అదృష్టవంతుడివన్న మాట. ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, వంటి నిండా బట్టలు వేసుకొని, కంటినిండా నిద్ర పోగలిగితే, ప్రపంచములోని 75 శాతం ప్రజల కన్నా ధనవంతుడివి అన్నమాట. నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, bank account లో balance ఉంటే, world లోని 8 శాతం అత్యంత ధనవంతుల్లో నీవొకడివన్న మాట.

నీ పిల్లల ద్వారా ఆప్యాయత, అనురాగం మరియు ఆనందం పంచుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నట్లైతే .. ప్రపంచపు 5 శాతం పిల్లలు పడే మానసిక, శారీరక బాధ వారి తల్లి తండ్రి విడి పోవడం వల్ల కలిగే దాంట్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట. నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లదంగా నవ్వగలిగితే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్న మాట. నీవు నేను వ్రాసినది చదువుతున్నావు అంటే , ప్రపంచంలో 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్న మాట.. నీవు ఈ భువి లోని అంద చందాలను చూసి ఆనందిస్తున్నావు అంటే, అంధకారంలో ఉన్న కోట్ల మంది కన్న నీవు ఎంతో అద్రుష్టవంతుడివి. నీవు ఏది తిన్నా అరిగించు కొని హాయి గా నిద్ర పోతే, కోట్ల మంది గుప్పెడు గోలీలు మింగిన అరగక నిద్ర రాక ఆయాసపడుతున్నవారి కంటే , నీవెంతో అద్రుష్టం ఉన్న వాడివి. నీవు చూడగలుగు తున్నావు, విన గలుగు తున్నావు, నడువ గలుగు తున్నావు, నీ చేతులతో నీ పనులన్నీ చేస్తుంటే.. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంగవైకల్యం ఉన్న వారి కంటే నీవు ఎంతో అదృష్టవంతుడివి.
నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న స్థిర చర ఆస్తుల విలువలని, నీలోని శక్తులని, నీకున్న అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట..

ఇప్పటికైనా నీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని సన్నిహితులతో పంచుకుంటూ తగ్గించుకుంటూ, ఉన్నంతలో నీవు సంతోషంగా ఉంటూ నీ కర్తవ్యం నెరవేర్చు మిత్రమా విజయం నీదే ! ఇప్పుడు నువ్వు నీ కుటుంబ ఒత్తిళ్లకు లోనయి, నీ తలిదండ్రులు-రక్తసంబంధీకులను గౌరవించకపోతే- రేపు నీ కొడుకులు కూడా అదే కుటుంబ ఒత్తిళ్లకు గురై నిన్ను గౌరవించడని తెలుసుకో. చిన్న పిల్లలు పెద్దవాళ్లను చూసి పెరుగుతారు. ఈరోజు నువ్వు ఏది చేస్తావో, రేపు నీ కొడుకూ నిన్ను అలాగే చూస్తాడు. అప్పుడు ప్రశ్నించే హక్కు నువ్వు కోల్పోతావ్. ఈ రోజు నీ భార్యకు నువ్వు లొంగిపోతే, రేపు నీ కొడుకు తన భార్యకు లొంగిపోతాడని తెలుసుకో. అప్పుడు నా కొడుకు భార్య కూచి అనే హక్కు నువ్వు కోల్పోతావ్. ఈరోజు నువ్వు నీ తలిదండ్రులను ప్రేమించి, గౌరవిస్తే రేపు నీ కొడుకు నిన్నూ-నీ భార్యను ప్రేమించి గౌరవిస్తాడని తెలుసుకో. నీ తలిదండ్రులు-కుటుంబసభ్యులు-ప్రాణమిత్రులు-స్నేహితులను దూరం చేసుకుంటే, నువ్వు కృత్రిమ జీవితం గడుపుతున్నట్లే లెక్క. కాబట్టి… మనం చనిపోయేలోగా విచారించడానికో, నాలుగు కన్నీటి చుక్కలు కార్చడానికో, ఇవన్నీ కాకపోతే మనల్ని కాటికి తీసుకుపోవడానికి ఓ పదిమందిని సంపాదించుకుంటే నీ జన్మ ధన్యం.

చివరగా.. మన దగ్గర ఉన్న డబ్బు, హోదా, కులం, పరపతి, అహంకారం ఇవన్నీ యాభై ఏళ్లు దాటిన వారికి అక్కరకురావు. అవన్నీ కట్టెలతోపాటు కలసిపోయేవే. మనతో వచ్చేది కీర్తి మాత్రమే. కట్టెలో కలిసిన వాడు ఎంతమందితో కలసి ఉన్నాడన్నదే మనతో చిరకాలం ఉండేది. సో.. ఉన్నంతకాలం పదిమందితో కలసి ఉండు. ఉన్నంతలో తిని ఆనందించు. ఇతరుల కంటే మనం చాలా చక్కగా బతుకుతున్నామన్న తృప్తి పడు. నీకు ఏ రోగాలూ రావు. ఇది జీవిత సత్యం!

– టివి శివారెడ్డి

Leave a Reply