Suryaa.co.in

Devotional

ఆలయాలు కొండమీద ఎందుకు నిర్మిస్తారో తెలుసా ?

దేవాలయం అంటే ఎంతోమంది పున్య ధామం. కొండ భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు మరీయు ఆలయo భగవంతుని కడుపు అని భావించాలి. దైవ దర్శనం అంటే గుడిలోకి వెళ్లి స్వామిని చూసి గంటలు కొట్టే నమస్కరించుకుంటారు. ఆ పద్దతిని పాటిస్తూ ఉంటాం. కానీ దూరంగా ఉండి కూడా కొండ కి నమస్కరించిన…స్వామి వారి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది.
పొరుగు ఊరి వారికి సుదూరం నుంచి వచ్చే కొత్తగా వచ్చిన వారికి దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవడానికి ఈ కొండ మీద కనిపించే ఆలయం బాగుంటుంది. కాబట్టి అప్పట్లో ఆలయo ఎక్కువగా కొండ మీద ఎత్తుగా ఉండేలా నిర్మాణం చేసేవారు. భగవంతుడి ఆలయం ,ఆలయ గోపురం,ఆ ఆలయo నెలకొని ఉన్న కొండ… ఎక్కువగా ఎత్తులో ఉండటం వలన భగవంతుడిని ఇప్పుడు తల ఎత్తి గర్వంగా భక్తులు చూసుకునేలా ఆలయ నిర్మాణం జరిగేది.
అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు, గుట్టలు, చూసుకొని మరి నిర్మిస్తూ. ఉంటారు. ఎందుకు అంటే మానవుడు ఎంత తెలివిగల వాడు అయినా ప్రకృతిని శాసించే సకల శక్తి వంతుడు కాలేడు. వరద, బీభత్సం, తుఫాన్లు, మొదలైన ప్రకృతి వైపరీత్యాలు వీటికి మనిషి భయపడాల్సిందే అటువంటి ప్రకృతి ప్రయత్నం చేసిన సమయాలలో మనిషి ప్రాణాలను కాపాడగలిగిన స్థలము దేవాలయాలు.
వరదలు, తుఫాన్లు, భూకంపాలు.. మొదలగు చాలా ప్రకృతి వైపరీత్యాలు నుండి కొండ మీద నిర్మించే అటువంటి ఆలయాలు చాలా రక్షణ కల్పిస్తాయి. కొండల మీద నిర్మించినటువంటి ఆలయాలను దూరంనుండి తలెత్తి చూడగానే మనసు మరో లోకంలోకి ప్రవేశించేందుకు సిద్ధ పడిపోతుంది. అటువంటి ఆలయ గోపురం లోనికి అడుగుపెట్టగానే మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి కాలుమోపిన అనుభూతి కలుగుతుంది.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE