– అందుకే షూ విసిరే ప్రయత్నం చేశా
– గవాయ్ చర్యకు నాది ప్రతిచర్య
– నేను ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు
– నేను ఎవరికీ భయపడను
– సుప్రీంకోర్టు సనాతన ధర్మాన్ని హేళన చేయకూడదు
– మీడియాతో సస్పెండయిన న్యాయవాది రాకేష్ కిషోర్
ఢిల్లీ: “నా ధర్మం విషయంలో అతను హేళనగా మాట్లాడి నందుకు. ఇది నా ప్రతి చర్య. తాగిన మత్తులో చెయ్యలేదు పూర్తి స్పృహ తోనే చేశాను. దీనికి నేను ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేద ” ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై షూ విసిరే ప్రయత్నం చేసి, బార్ కౌన్సిల్‌తో సస్పెన్షన్‌కు గురైన 70 ఏళ్ల వృద్ధ లాయర్ రాకేష్ కిశోర్ చేసిన వ్యాఖ్యలివి.
ఒక న్యూస్ ఏజెన్సీతో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఇతర మతాల విషయంలో ఒకలా నా ధర్మం విషయంలో ఒకలా కోర్టులు వ్యవహరించడం నాకు నచ్చలేదు. సుప్రీం కోర్టు సమాధానం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సనాతన ధర్మ విషయాలను అపహాస్యం చేయకూడదు.
సెప్టెంబర్ 16న సీజీఐ ఒక పిల్ ని ఎగతాళి చేస్తూ ‘విగ్రహాన్ని పునరుద్ధరించమంటే.. పోయి విష్ణువుని ప్రార్థించుకో అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అతను చేసిన దానికి ఇది నా స్పందన. నేను ఎవరికి భయ పడను. చివరి వరకు సనాతన ధర్మానికి అండగా నిలుస్తాను.”
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పరాయిదేశం అయిన మారిసస్ కు వెళ్లి, అక్కడ భారతదేశంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడటం ఎందుకు?
అక్రమ కట్టడాల పైకి బుల్డోజర్ పంపి తొలగించడం తప్పు ఎలా అవుతుంది?