కాంతారా చాప్టర్ 1… ఒక అద్భుతమైన సినిమా!
ఈ సినిమాపై రాం గోపాల్ వర్మ అన్నది:
కాంతారా అద్భుతంగా ఉంది; ఇండియాలో ఉన్న ఫిలిమ్ మేకర్స్ అందరూ ఈ ఊహకందని అద్భుతాన్ని చూసి సిగ్గుపడాలి…”
రాం గోపాల్ వర్మ చాల కచ్చితంగా, నిక్కచ్చిగా చెప్పారు కాంతారా గురించి.
‘సినిమా’ అన్న అనుభూతిని ఈ సినిమా సరిగ్గా కాదు విశేషంగా కలిగిస్తుంది.
కాంతారా వంటి సినిమా దక్షిణాదిలో రావడం దక్షిణాది ప్రతిభ. ఉత్తరాదిలో ఇటువంటి సినిమా తియ్యగల దర్శకులు లేరు అన్నది ఉన్న విషయం! ఇలాంటి సినిమా హిందీలో ఇంకో పాతికేళ్ల తరువాతైనా తియ్యగలరా?
సౌండ్ & విషువల్స్, రి రికడింగ్ (రికార్డింగ్) స్థాయి మహోన్నతంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలా కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉంది.
రిషబ్ శెట్టి… ఈ సినిమా దర్శకుడు, కథా నాయక నటుడు రిషబ్ శెట్టి. నటనకు, దర్శకత్వానికి మరో స్థాయి ప్రమాణాల్ని స్థిరపరిచారు ఆయన ఈ సినిమాతో.
“రిషబ్ నువ్వు గొప్ప నటుడివా? గొప్ప దర్శకుడివా?” అన్న రాం గోపాల్ వర్మ ప్రశ్నకు ఇదే అని ఏదో జవాబు చెప్పడం సరి అవదు.
దేశ సినిమాలో 1960కు ముందే మొదలైన ‘క్రైస్తవ, ముస్లీమ్ ఎలివేషన్’ అన్న మానసిక బలహీనత, అవాంఛనీయ పరిణామం తలల్ని తన్నుతూ ‘సనాతన సామర్థ్యం’తో వచ్చిన గొప్ప సినిమా కాంతారా.
ఇంటర్వెల్ తరువాత సినిమాలోని వైదికత్వం ప్రశస్తంగా ఉంది. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్.టీ. రామారావు రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని చాల గొప్పగా తీశారు. ఇదిగో ఈ సినిమాలో రిషబ్ ఆలయ నిర్మాణ, వైభవ ఘట్టాన్ని కడుగొప్పగా తీశారు.
మతి పగిలిపోయిన మేధ, కుల నీచత్వం, మిషనరీలు, మాఫిఅలు, కమ్యూనిస్ట్స్,
మధ్యతరగతి బుద్ధి మాంద్యం…వీటికి అతీతంగా కాంతారా గొప్ప సినిమా!
మంచి మిత్రులు, దేవదాసు, జీవన తరంగాలు, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాల దగ్గరే ఆగిపోయి అంతకు మించిన లోకం లేదని ఇంకా అనుకుంటున్న, అంటున్న మధ్యతరగతి మాంద్యాన్ని బాగు చేసే ప్రయత్నం చెయ్యకుండా, జై భీం, తంగలాన్ సినిమాలు గొప్పవి అన్న తెలుగు వికారాన్ని గట్టిగా పక్కకు తన్నేసి
ఇదిగో ఈ కాంతారా సినిమాను అస్వాదించడంలోకి వెళదాం.
– రోచిష్మాన్
9444012279