Home » శ్రీవారి సన్నిధిలో జగన్నామస్మరణ చేయిస్తారా?

శ్రీవారి సన్నిధిలో జగన్నామస్మరణ చేయిస్తారా?

– తిరుమల కొండపై టీటీడీ ఛైర్మన్ సతీమణే క్షమించరాని తప్పిదానికి పాల్పడ్డారు
– జరిగిన మహాపరాధానికి హిందూసమాజానికి, సుబ్బారెడ్డి బహిరంగ క్షమాపణలుచెప్పి రాజీనామా చేయాలి
– టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్
కలియుగ వైకుంఠం, పరమపవిత్రమైన, ప్రపంచప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిఏటా రాష్ట్రముఖ్యమంత్రిస్థానంలోఉన్న వారుసతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడమనేది ఎప్పటినుంచో వస్తున్న సత్సం ప్రదాయమని, కానీ తద్భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే పట్టు వస్త్రాలుసమర్పించారని, దానికితోడు తిరుమలకొండపై గోవిందనామస్మరణకు బదులుగా జగన్నామస్మరణ జరిపించడం, టీటీడీ ఛైర్మన్ సతీమణి గారే ఆవిధంగా వేంకటేశ్వరస్వామిభక్తుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరించడం దారుణాతి దారుణ మని టీడీపీనేత, టీటీడీ మాజీఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఆక్షేపించారు. గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
సంప్రదాయాలకు, పవిత్రతకు మారుపేరైన తిరుమలక్షేత్రంలో జగన్నామస్మరణ చేయడం, అదీ స్వయంగా టీటీడీ ఛైర్మన్ సతీ మణి గారే చేయించడం క్షమించరాని నేరమన్నారు. గతంలో కూడా టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి రాజమహేంద్రవరంలో జీసస్ నుస్మరించడం జరిగిందన్నారు. వై.వీ.సుబ్బారెడ్డి, ఆయన కుటుం బం తిరుమలస్వామివారిని అగౌరవపరిచేలా వ్యవహరించడం, అదీ టీటీడీ ఛైర్మన్ గా ఉండిచేయడం ఎంతమాత్రం తగనిపని అని సుధాకర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉండటానికి ఎంతమాత్రం వీల్లేదని, ఆయన తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలని సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు. గతంలో పీఠాధిపతిగా ఉన్నఒకస్వామీజీ తిరుమలలో ఏమీ జరగకపోయినా, ఏదో జరిగిపోతోందని నానాయాగీ చేశాడని, ఆ స్వామీజీకి ఇప్పుడు తిరుమలక్షేత్రం వేదికగా జరుగుతున్న హిందూమతవ్యతిరేక చర్యలుకనిపించడం లేదా అని టీడీపీనేత నిగ్గదీశారు.
హిందూమతాన్ని, హిందూభక్తులను కించపరిచేలా వారిలో ఆగ్రహావేశాలు పెచ్చరిల్లేలా టీటీడీ విభాగంవారే ప్రవర్తించ డాన్ని హిందూసమాజం తరుపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ న్నారు. తిరుమతక్షేత్రంలోనే గాక, తనకు తెలిసీ వై.వీ.సుబ్బారెడ్డి చేసిన హిందూమతవ్యతిరేక తప్పిదాలకు ఆయనతక్షణమే హిందువులకు బహిరంగక్షమాపణలుచెప్పాలని, వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సుధాకర్ యాదవ్ డిమాం డ్ చేశారు.

Leave a Reply