బాలినేని పిచ్చి వాగుడు వాగుతున్నాడు

– అవసరం తీరాక జగన్ రెడ్డి పట్టించుకోడన్న బాలినేనికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా?
– కొండేపి టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి జగన్ రెడ్డి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. నిన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్ర పోకుండా పబ్జీ ఆడుకున్న జగన్ రెడ్డికి ఇప్పుడు మా కూటమిని చూసి నిద్ర పట్టడం లేదు. రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని తెలిసి జగన్ రెడ్డి భజన బృందం మహా కూటమిపై విషం చిమ్ముతొండి.

ఏం చేసైనా సరే కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అనేది మూసేయడానికి దగ్గరగా ఉన్న దుకాణం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సొంత పార్టీ నేతలే తాడేపల్లి ప్యాలెస్ గేటు మందు నుంచొని చివాట్లు పెడుతున్నారు.

మా పొత్తు ధర్మాన్ని చూసి ఓర్వలేక బాలినేని శ్రీనివాస్ పిచ్చి వాగుడు వాగుతున్నాడు. అవసరం తీరాక జగన్ పట్టించుకోడని బాలినేని శ్రీనివాసే అన్నాడు. పొత్తులు, ఎత్తులు వేస్తున్నారన్న జిత్తుల మారి నక్క ఏం చేయాలో తెలియక తాడేపల్లిలో నిద్ర పోతోంది. తన అధినేతపై రోజుకో మాట, పూటకో పలుకు పలికిన బాలినేనికి పొత్తులపై మాట్లాడే అర్హత లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వల్ల ఏం కాదని వారిని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ప్రజలు గమనించారు. కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రాన్ని అదఃపాతాళానికి తొక్కేసిన జగన్ రెడ్డినే రానున్న ఎన్నికల్లో అదఃపాతాళానికి తొక్కేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply