టీడీపీ పుస్తకంలోని అంశాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?

• హామీల అమలుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాకే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఓట్లు అడగాలి
• నవరత్నాలు+మేనిఫెస్టో+పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ రెడ్డి అమలు చేసింది కేవలం 15శాతమే
• 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయం
• 99 శాతం హామీలు అమలుచేశామంటూ ప్రజల్ని మోసగించడం కాదు.. టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
• మద్య నిషేధం.. సీపీఎస్ రద్దు… ప్రత్యేకహోదా.. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ… అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయి?
• పోలవరం, అమరావతి నిర్మాణాల మాటేమిటి? ఏటా ప్రతి రైతుకి ఇస్తామన్న రూ.12,500ల సంగతేమిటి?
• పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
• ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ
• రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదు
• 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి..ప్రజలకు సంతోషం
– టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్

వైసీపీ ప్రభుత్వ పాలన ఎలాఉందో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రజలకు చెప్పే పరిస్థితి వచ్చిందని, తమదాకా వస్తే గానీ వాస్తవం అర్థంకాదన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ఇచ్చిన హామీలు అమలుచేయనందున, ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారని, దీనికంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసగించడమేనని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

“2014 మరియు 2019 ఎన్నికలకు ముందుగానీ, అధికారంలో ఉన్న ఇన్నేళ్లలో గానీ జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని అమలుచేసినవెన్నో గమనిస్తే కేవలం 15శాతం హామీలు మాత్రమే అమలుచేశారు. 85శాతం హామీలు పూర్తిగా బుట్టదాఖలు చేశారు. ప్రజలకుకల్లబొల్లి మాటలు చెబుతూ కాలక్షేపం చేసుకొస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవం.

99శాతం హామీలు అమలుచేశామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? జగన్మోహ న్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు నవరత్నాలనే హామీలిచ్చాడు. వాటిలో 99 శాతం అమలు చేశానని కూడా చెప్పుకుంటున్నాడు.

మద్య నిషేధం చేశాకే మరలా ఓట్లు అడుగుతామన్నవారు.. వాస్తవంలో చేస్తున్నది ఏమిటి?
మద్యనిషేధం చేశాకే మరలా ఓట్లు అడుగుతానని జగన్ రెడ్డి చెప్పింది నిజం కాదా? ఇప్పుడు కల్తీమద్యం తనపార్టీవారికిచెందిన కంపెనీలద్వారానే తయారు చేయిస్తూ, దాన్ని అధికధరకు అమ్ముతూ, కల్తీమద్యం తాగిస్తూ పేదల జీవితాల తో చెలగాటమాడుతున్నది నిజం కాదా? మద్యాన్ని నగదుకే విక్రయిస్తూ అంతు లేని అవినీతి చేస్తున్నారు. అమ్మేదే కల్తీ మద్యం..అదికూడా ఎక్కువ ధరకు. దానిలో మరలా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, మద్యం అమ్మకాలపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని 25ఏళ్లపాటు తాకట్టు పెట్టి రూ.8వేలకోట్లకు పైగా అప్పులు తేవడం. ఇవన్నీ ఏమిటి? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన హామీ లో జగన్మోహన్ రెడ్డి విఫలమైనట్టా..కాదా? దీనిపై వైసీపీనేతలు, మంత్రులు ఏం సమాధానం చెబుతారు? ఇష్టమొచ్చినట్టు మాట్లాడకుండా నేరుగా అడిగిన వాటికి సమాధానం చెప్పాలి.

ప్రత్యేకహోదా సాధించి యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ సంగతేమిటి?
25 మంది ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి పరిశ్రమలు వచ్చేలా చేసి, యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిం ది వాస్తవం కాదా? 2019కు ముందు తన పార్టీ ఎంపీలతో రాజీనామాల డ్రామాలాడిన జగన్ రెడ్డి.. తరువాత వైసీపీ ఎంపీలతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయించాడా? హోదా కోసం ఎప్పుడైనా పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు పోరాడారా? అధికారంలోకి రాకముందు ఒకటిచెప్పి, తరువాత మాట మార్చారు. మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామన్న వారు.. చివరకు కేంద్రం ముందు మెడలు వంచింది నిజం కాదా?

అమరావతి నిర్మాణంపై ఎందుకు నాలుక మడతేశారు?
అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి నిర్మాణానికి సమ్మతించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చాడు? చివరకు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా.. అనాథ రాష్ట్రంగా మార్చారు. అమరావతి ప్రాంతాన్ని అడవిలా మార్చారు. రాజధానిలోని రూ.10వే లకోట్ల విలువైన నిర్మాణ సామగ్రిని వృథాచేశారు. మూడు రాజధానుల ఆలోచన తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో ఎందుకిలా చేశారో, ఇంతకుముందు ఇలా చెప్పామని, అధికారంలోకి వచ్చాక ఇలా చేశామని, రేపు మరలా అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా?

సాగునీటి రంగానికి సంబంధించిన హామీలన్ని గాలికొదిలేశారు…
సాగునీటి రంగం.. ప్రాజెక్టుల నిర్మాణంపై ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా జగన్మో హన్ రెడ్డి నెరవేర్చలేదు. చంద్రబాబు అవినీతిమయం చేసిన పోలవరం నిర్మాణం తామే పూర్తిచేస్తామన్న వారు ఇప్పటివరకు ఏమీచేయలేదు. జలయజ్ఞం కింద రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారు? ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పగల రా? పోలవరం నిర్మాణం ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారో చెప్పగలరా? వెలిగొండ ప్రాజెక్ట్ ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని సాగునీ టి చెరువులన్నింటినీ నీళ్లతో నింపుతామన్నారు. ఇవన్నీ ఏమయ్యాయి?

2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. విద్యుత్ ఛార్జీల పెంపు.. పెట్రోల్, డీజిల్ ధరల భారంపై ఏం సమాధానం చెబుతారు?
2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమైంది? నిత్యావసరాల ధరలు.. విద్యుత్ ఛార్జీలు.. పెట్రోల్, డీజిల్ ధరలు చంద్రబాబు బాగాపెంచాడు.. తాము వస్తే తగ్గిస్తామన్నారు. అది ఏమైంది? జగన్మోహన్ రెడ్డి హాయాంలో 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. నిత్యావసరాల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజిల్ అధికరధర కు అమ్మిస్తున్నారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించినా, రాష్ట్రప్రభుత్వ వాటాగా తగ్గించాల్సిన సొమ్ము ఎందుకు తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో లీటర్ కు రూ.10 నుంచి రూ.15వరకు తేడా ఉంది నిజం కాదా? పెట్రోల్..డీజిల్ అమ్మకాలతో ఎన్నివేలకోట్లు కొల్లగొట్టారో ప్రజలకు చెప్పా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. చమురు ధరలపెంపుతో నిత్యావసరాల ధరలు ఇంకా పెరుగుతున్నాయి. ప్రజల జీవనప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవేవీ ప్రజలకు ఎందుకు చెప్పరు?

ప్రతిరైతుకి ఏటా రూ.12,500లు ఇస్తామన్న హామీ ఏమైంది?
రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతుకి నేరుగా రూ.12,500 ఇస్తామన్నారు. అదే మొత్తం సాయాన్ని కౌలురైతులకు కూడా ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఆఖరికి రైతులకు పంటనష్టం పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చింది నిజం కాదా? రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు.

సీపీఎస్ రద్దు సంగతేమిటి?
ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పడం. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ల నోళ్లు మూయించారు. సీపీఎస్ రద్దు కాదుకదా …చివరకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తామన్నారు. అదీ లేదు. అంగన్ వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. అదీ లేదు. అంగన్ వాడీ సిబ్బంది 26 రోజులుగా సమ్మె చేస్తుంటే, వారికి న్యాయం చేయలేక చివరకు ఎస్మా చట్టం ప్రయోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో కోతలు పెట్టారు. జీవోనెం-77 తెచ్చి చదువుకునే యువతకు అన్యాయం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధి పెంచి అందరికీ వర్తింపచేస్తామన్నారు. కానీ చివరకు మార్పులు చేసి, పాక్షికంగా నే అమలుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

హామీల అమల్లో మడమతిప్పిన జగన్మోహన్ రెడ్డి…
నవరత్నాలు, మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం 199. వాటిలో అమలు చేసినవి కేవలం 17 మాత్రమే. అసలు అమలు కాని హామీలు 109. ఇవి కాకుండా పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 51, వాటిలో అమలుచేయనివి 44. అంటే 86శాతం హామీలు అమలే చేయలేదు. అలానే పాదయాత్రలో జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా ఇచ్చిన హామీలు 480. వాటిలో అమలుచేసినవి కేవలం 3. అమలు కానివి 477..అంటే 98శాతం.

85 శాతం హామీల అమల్లో ఫెయిల్ అని టీడీపీ ముద్రించిన పుస్తకంలోని అంశాలకు సమాధానంగా ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా?
ఇవన్నీ కలిపితే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అయితే, వాటిలో అమలుచేసింది కేవలం 15శాతం మాత్రమే. 85శాతం హామీలకు మస్కా కొట్టి, ప్రజల్ని మోసగించారు. జగన్మోహన్ రెడ్డి హామీల అమల్లోచేసిన మోసాల్ని వాస్తవాలతో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ‘నవరత్నాలు+మేనిఫెస్టో+జగన్ రెడ్డి ఇచ్చిన హామీల అమల్లో 85శాతం ఫెయిల్’ అనే పేరుతో పుస్తకం కూడా ముద్రించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. టీడీపీ తరుపున తాము ముద్రించిన పుస్తకంలోని అంశాలకు సమాధానంగా శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం.

చంద్రబాబుతో పోలిస్తే సంక్షేమరంగానికి జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు తక్కువే. బడ్జెట్ పెరిగినా సంక్షేమ రంగానికి కేటాయింపులు ఎందుకు పెంచలేదో ప్రభుత్వం చెప్పాలి
సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముఖ్యమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమిటో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఈ రోజు వరకు రాష్ట్రంపై సుమారుగా ఉన్న అప్పు రూ.12లక్షల కోట్లు. రెవెన్యూ ఆదాయం గతంలోకంటే ఈ ప్రభుత్వంలో విపరీతం గా పెరిగింది. బడ్జెట్ లెక్కలు.. కాగ్ లెక్కల ప్రకారం ఆదాయం పెరిగినట్టు ఈ ప్రభుత్వమే చెప్పింది. పెరిగిన రెవెన్యూ ఆదాయానికి తగినట్టుగా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు?

చంద్రబాబు హాయాంలో మొత్తం బడ్జెట్లో సంక్షేమ రంగానికి 42, 44 శాతం నిధులు కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ పెంచినా, సంక్షేమ రంగానికి కేటాయింపులు ఎందుకు పెంచలే దు? 40 నుంచి 42 శాతమే ఖర్చు చేయడమేంటి? సంక్షేమ రంగానికి 44శాతం నిధులు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం, మిగిలిన సొమ్మును మౌలిక వసతుల కల్పన, రాష్ట్రాభివృద్ధికి ఖర్చుపెట్టింది. కానీ ఈప్రభుత్వంలో మౌలిక వసతుల కల్పనే జగరడం లేదు. రోడ్లులేవు..డ్రైనేజ్ లు లేవు. ప్రజలకు మంచినీ రు, రైతులకు సాగునీరు అందించలేదు. ఎక్కడా కొత్తగా నిర్మాణాలు చేసిందిలేదు . వీటన్నింటికీ తోడు అదనంగా కేంద్రప్రభుత్వమిస్తున్న నిధులు కూడా దారి మళ్లించి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. నిజంగా అవినీతి జరగకపోతే ఆదాయం పెరిగి.. అప్పులు పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగలేదో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధా నం చెప్పాలి.

అప్పుల సొమ్ముతో పాటు, ఇసుక..మద్యం, మైనింగ్ దోపిడీతో వేలకోట్లు కొట్టేశారు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అప్పుల వివరాలు దాచడంపై ఈ ప్రభుత్వానికి కాగ్ ఏటా మొట్టికాయలు వేసింది. ట్రజరీ అనుమతులు లేకుండా ఖర్చులు చేశారు. బడ్జెటేతర అప్పులు తెచ్చారు. కేవలం అప్పులకోసమే కొన్ని కార్పొరేషన్లు సృష్టించారు. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధిదాటి అప్పులు తేవడంపై కేంద్ర ఆర్థిక శాఖ తాఖీదులు ఇచ్చింది. అయినా కూడా ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఈ రోజుకి కూడా అప్పులనే నమ్ముకున్నారు. నిన్నగాక మొన్న కూడా రూ.3వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈ సొమ్మంతా ఎటుపోతోంది? అప్పుల సొమ్ము కాకుండా ఇసుక అమ్మకాలతో వేలకోట్లు, మద్యంపై వేలకోట్లు, మైనింగ్ దోపిడీతో వేలకోట్లు దోచేస్తున్నారు.

హామీల అమలుపై శ్వేతపత్రం విడుదలచేశాకే జగన్ ప్రజల్ని ఓట్లు అడగాలి
2014కు ముందు, 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని.. అమలుచేసినవి ఎన్నో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అధికారంలోకి రాకముందు రాష్ట్రంపై ఉన్నఅప్పులెన్ని.. 2019 నుంచి ఇప్పటివరకు చేసిన అప్పుఎంత? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? శ్వేతపత్రం విడుదల చేశాకే మరలా ప్రజల్ని ఓట్లు అడగాలి. ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పకపోతే, ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.” అని రవీంద్రకుమార్ తేల్చిచెప్పారు.

Leave a Reply