– తన ఆనందంకోసం.. కక్షసాధింపులో భాగంగా నారాయణను అరెస్ట్ చేయించిన ముఖ్యమంత్రి, ప్రతిపక్షానికి భయపడుతున్నాడని తేలిపోయింది.
– తన ప్రభుత్వంపై నానాటికీ పెరిగిపోతున్న ప్రజాగ్రహం..తనప్రభుత్వానికి చేటుచేస్తున్న మంత్రులను కట్టడిచేయలేని తన డొల్లతనం ప్రజలకు తెలియకూడదనే జగన్ రెడ్డి నారాయణను అరెస్ట్ చేయించాడు
• ఒకవ్యవస్థలో తప్పుజరిగిందని, సదరువ్యవస్థలనిర్వాహకుడైన నారాయణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, పేపర్ లీకేజ్ ఘటనల్లో సంబంధంలేకుండా మాట్లాడిన మంత్రి బొత్సను తొలుత అరెస్ట్ చేయాలి.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
పదోతరగతి పరీక్ష పత్రాల లీకేజ్ ఆరోపణలతో జగన్ ప్రభుత్వం నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను అరెస్ట్ చేయడంచూస్తుంటే, జగన్ రెడ్డి కక్షసాధింపులపర్వం పరాకాష్ట కు చేరినట్టు స్పష్టమవుతోందని టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆవివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ, నారాయణ విద్యాసంస్థలపై, వాటి అధినేత నారాయణపై ఈప్రభుత్వం రాక్షసప్రవృత్తితో వ్యవహరిస్తోంది. పదోతరగతి పరీక్షపత్రాలు లీక్ అయ్యాయో లేదో ఈప్రభుత్వానికి, విద్యాశాఖమంత్రికి స్పష్టత ఉందా? విద్యాశాఖ మంత్రే పరీక్షపత్రాలు ఎక్కడాలీక్ కాలేదంటారు…మరలా ఆయనే పరీక్షపత్రాల లీకేజ్ ఘటనలకు సంబంధించి ప్రభుత్వఉపాధ్యాయులను, కొందరు ప్రైవేట్ పాఠశాలలసిబ్బందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామంటారు.
పోలీస్ శాఖకూడా పరీక్షపత్రాలు లీక్ కాలేదు.. మాస్ కాపీయింగ్ మాత్రమే జరిగిందని గతంలో చెప్పింది. ఇలా పొంతనలేకుండా మాట్లాడుతున్న మంత్రి, ప్రభుత్వపెద్దలు, పోలీస్ శాఖవారు దేన్ని ఆధారంచేసుకొని మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేశారు? నారాయణను ఏకారణంతో అరెస్ట్ చేసినా.. ఆయనపై మోపిన అభియోగాలు ముమ్మాటికీ నిరాధారమైనవే.
నారాయణవిద్యాసంస్థల్లో పరీక్షపేపర్లు లీక్ అయ్యాయికాబట్టి, దానికి నారాయణే బాధ్యుడు అంటున్న ప్రభుత్వం..అవినీతికేసుల్లో పట్టుబడుతున్న ప్రభుత్వఉద్యోగుల అవినీతికి ప్రభుత్వమే బాధ్యతవహిస్తుందని, ముఖ్యమంత్రే బాధ్యుడని చెప్పగలదా? పేపర్ లీకేజ్ వ్యవహారంలో నారాయణ బాధ్యతఎంతఉందో, అదేవిధంగా ప్రభుత్వఉద్యోగులు ఎవరైనా లంచం తీసుకుంటే, అందుకుబాధ్యులు ఆయాశాఖల్లోని మంత్రులేఅంటూ వారినికూడా అరెస్ట్ చేయాలికదా.!
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా అవినీతిజరుగుతోంది.. మరిదానికి ముఖ్యమంత్రిని బాధ్యుడినిచేస్తూ ఆయన్నికూడా అరెస్ట్ చేయాలికదా! ఏదోఒకకారణంతో నారాయణని అరెస్ట్ చేయాలి.. ఆయన్నిఅనేకకేసుల్లో ఇరికించి, వాటిని చంద్రబాబుగారికి, టీడీపీకి ఆపాదించాలని ఎప్పట్నుంచో జగన్మోహన్ రెడ్డి తెగఉబలాట పడుతున్నాడు. ఆక్రమంలోనే ఈ ముఖ్యమంత్రినారాయణ విద్యాసంస్థలపై దాడులు చేయిం చాడు.
అనేకమంది సిబ్బందిపై అక్రమకేసులుపెట్టి, వారితో నారాయణపేరు చెప్పించాడు. అంతటితో ఆగకుండా రాజధానివ్యవహారాలు, అమరావతి భూములకుసంబంధించి కూడా నారాయణపేరు తెరమీదకుతెచ్చి పలుమార్లు ఆయన్నిబదనాంచేయించారు.
అవన్నీ అలాఉంటే నారాయణ ఏదోపెద్దనేరస్తుడు,తప్పించుకుతిరుగుతున్నట్టుగా భావిస్తూ ఈప్రభుత్వం నేడు ఆయన్ని అరెస్ట్ చేసినవిధానం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఈరోజు నారాయణకుమారుడి వర్థంతి.. ఆయననివాసంలో దానికి సంబంధించిన కార్యక్రమ నిర్వహణఏర్పాట్లలో ఆయన నిమగ్నమైఉన్నప్పుడు చిత్తూరు పోలీసులు, తెలంగాణకు వెళ్లి, అక్కడిపోలీసులకు అనుమతి ఇవ్వకుండా నేరుగా ఆయన్ని అదుపులోకి తీసుకోవడం మరోనేరం. కుమారుడి వర్థంతినాడే మాజీమంత్రిని అరెస్ట్ చేయించడంచూస్తుంటే, ఈముఖ్య మంత్రి ఎంతనీచస్థాయికి దిగజారాడో అర్థమవుతోంది.
పరీక్షపేపర్లు ఎక్కడా లీక్ కాలేదని, కేవలం మాస్ కాపీయింగ్ మాత్రమే జరిగిందని స్వయంగా విద్యాశాఖమంత్రి బొత్స, మరోపోలీస్ అధికారిచెప్పారు. మాస్ కాపీయింగ్ కు, పేపర్ లీకేజ్ కి మధ్యఉన్నవ్యత్యాసం తెలుసుకోకుండా, ఈప్రభుత్వం నారాయణను అరెస్ట్ చేయించింది. ఒకవ్యవస్థలో తప్పుజరిగిందని, సదరువ్యవస్థలనిర్వాహకుడిని బాధ్యుడిని చేస్తూ, నారాయణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, పేపర్ లీకేజ్ ఘటనల్లో సంబంధంలేకుండా మాట్లాడిన మంత్రి బొత్సను తొలుత అరెస్ట్ చేయాలి.
బొత్సను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి, ఆయన ప్రభుత్వానికి ఉందా? తనప్రభుత్వం ఉంటుందో లేదోనన్న అభద్రతా భావంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆక్రమంలోనే మంత్రి బొత్స తప్పుచేసినా, ఆయన శాఖలో తప్పులుజరిగినా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోతున్నాడు. ఒక్క విద్యాశాఖలో జరిగిన తప్పిదాలేకాదు… ఆరోగ్యశాఖలో జరిగే తప్పులు, హోంమంత్రిగా ఉన్నఆమె మాట్లాడిన బాధ్యతలేని వ్యాఖ్యలుచూస్తుంటే, మంత్రులెవరూ వారివారిశాఖలపై పూర్తివిశ్వాసంతో, తృప్తి తో ఉన్నట్లు అనిపించడంలేదు.
నారాయణ అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయకక్షసాధింపులో భాగంగాజరిగిందే. ఆకేసులో ఉన్న లీగాలిటిని బట్టే, అది నిలబడుతుందో లేదో చెప్పొచ్చు. కేసులునిలబడవని తెలిసే.. ఈముఖ్యమంత్రి టీడీపీనేతలను అక్రమంగా తప్పుడు కేసులతో అరెస్ట్ చేయించి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడు. తన పాలనా వైఫల్యాలు,తన మంత్రులవ్యాఖ్యలు తనకుముప్పుగా పరిణమిస్తున్నాయని ముఖ్యమంత్రికి అర్థం అవుతోంది. అందుకేఇలాంటి దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
తనకోటలు బీటలు వారుతుందని ముఖ్యమంత్రికి అర్థమవుతోంది. నారాయణవిద్యా సంస్థల్లో తప్పిదం జరిగిందంటూ నారాయణను అరెస్ట్ చేయించిన జగన్ రెడ్డి, తన ప్రభుత్వంచేస్తున్న అవినీతి, అరాచకాలకు బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రిపదవికి రాజీనామాచేయగలడా? నారాయణపై కక్షసాధింపుతోనే ముఖ్యమంత్రి ఆయనపై తప్పుడుకేసులు పెట్టి అరెస్ట్ చేయించాడని రాష్ట్రమంతా అనుకుంటోంది.
ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన దుందుడుకు చర్యలకు స్వస్తిచెప్పకపోతే, టీడీపీ వీధిపోరాటాలకు సిద్ధమవుతోంది. శ్రీలంకమాదిరే రాష్ట్ర ప్రజలంతా తిరగబడి తాడేపల్లి ప్యాలెస్ పై, మంత్రులనివాసాలపై దాడులకుపాల్పడకముందే జగన్ రెడ్డి తనతప్పిదాలను సరిదిద్దుకుంటే మంచిదని హితవుపలుకుతున్నాం.
తెలుగుదేశం నేతల్ని, కార్యకర్తలను మూడేళ్లనుంచి ముఖ్యమంత్రి వేధిస్తూనేఉన్నాడు.
అలా నే తనదోపిడీ, అవినీతికి ప్రజల్ని బలిచేస్తున్నాడు. దానితాలూకా ప్రభావమే చంద్రబాబు పర్యటనలకు వచ్చినస్పందన. నారాయణ విద్యాసంస్థ్లలో పరీక్షపత్రాలు లీక్ అయ్యాయన్న ఆధారాలు ఈప్రభుత్వంవద్దఉన్నాయా? ఎక్కడో ఎవరో సిబ్బందితప్పుచేస్తే దానికి నారాయణ ను అరెస్ట్ చేసి, తప్పంతా ఆయనదే అని ఎలానిర్ణయిస్తారు? నారాయణ అరెస్ట్ కు ప్రభుత్వం ముమ్మాటికీ భారీమూల్యంచెల్లించక తప్పదు.