Home » రాజయోగాలను ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం

రాజయోగాలను ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం

నవగ్రహాల్లో ఐదు, రెండు, తొమ్మిది, పది మొదలైన స్థానాలలో ఏ గ్రహమైనా ఆధిపత్యం వహిస్తే రాజయోగాలను అందిస్తారని శాస్త్రం చెబుతోంది. అందులో రెండో స్థానం కుటుంబాధి పత్యం, ఐదో స్థానం త్రికోణ స్థానంగా వ్యవహరించటంతో పాటు కుటుంబంలో మంచి అభివృద్ది అవకాశాలు లభిస్తాయి.
పదకొండో స్థానం ధనాధిపత్యం, పదో స్థానంలోలాభాధిపత్యం వహించటంతో.. వృత్తుల్లో మంచి అభివృద్దిని పొందుతారు. మంచి ఆనందదాయకమైన జీవితాన్నికూడా పొందుతారు. అదేసమయంలో ఈ జాతకుల గ్రహాలు నీచస్థానాలను పొందకూడదు. రాహు 3, 5, 10, 11 స్థానాల్లో కేంద్ర, కోణాలలో ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలుంటాయి. రాహు, కేతులు పాప గ్రహాలైన ఒక్కో సమయంలో వాటి ఆధిపత్యం వలన మంచి యోగాలు లభిస్తాయి. కేతు మూడోస్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఆశించవచ్చును.
అయితే ఐదు, తొమ్మిది స్థానాల్లో ఉంటే కీడును కలిగిస్తాడు. పదో స్థానంలో తప్ప మిగిలిన కేంద్రస్థానాల్లో రాహు ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలు ఉండవు. రాహు, కేతులు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి అభివృద్ది అవకాశాలు లభిస్తాయని గ్రహించాలి. శుక్ర, చంద్రులు మూడో స్థానంలో ఉంటే శుక్రదశా కారణంగా మంచి రాజయోగాలను ప్రసాదిస్తాడు.
ఈ కాలంలో కీర్తి ప్రతిష్టలు చేరుతాయి. పదో స్థానంలో ఆధిపత్యంతో పాటు 3, 11 స్థానాల్లో గ్రహాధిపత్యం ఉంటే సుమారైన ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా 9వ స్థానంలో ఆధిపతిగా ఎనిమిదో స్థానంలో ఉంటే కీడైన ఫలితాలు కలుగుతాయి. గురు ఎనిమిదో స్థానంలో ఉంటే మంచి యోగాలను అందిస్తాడు. తొమ్మిదో స్థానంలో ఆధిపత్యం వహిస్తూ అష్టమాధిపత్యం కారణంగా లేదా గ్రహాల దృష్టి ప్రభావం చేత దశాకాలంలో మంచి ఫలితాలు అందజేస్తారు.
10,11 స్థానాల్లో అధిపతులుగా ఉన్న గ్రహాలు వేరొక గ్రహ సంయుక్తంతోనూ లేదా దృష్టి ప్రభావంతో లాభాధిపతి దశాకాలంలో మంచి ఫలితాలను అందిస్తారు. పదో స్థానాధిపతి దశాకాలంలో శుభఫలాలు, అశుభఫలాలు సంయుక్తంగా కలుగుతాయి. శని గ్రహం 3, 9 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలను అందజేస్తాడు.
అంతేగాక వారి స్థానాల్లో 9వ స్థానంలో ఆధిపత్యం వహించినా మంచి లాభాలు లభిస్తాయి. 5, 10 స్థానాలకు చెందిన అధిపతులు 10వ స్థానంలో ఉంటే కీర్తి, అధికారయుక్తంగా జీవిస్తారు. 9, 10 స్థానాలకు చెందిన అధిపతులు లగ్నంతో పాటు 7వ స్థానంలో ఉంటే ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. గురు, చంద్రులు కటంకంలోనూ, సూర్య, శని, కుజ స్థానాలు ఉచ్చస్థానం పొందటం ద్వారా బంగారం, గృహనిర్మాణం, వాహనాలు వంటి నూతన వస్త్రాలను చేర్చటంలో ఆసక్తి వహిస్తారు.

– చింతా గోపీ శర్మ సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం,
9866193557

Leave a Reply